- Telugu News Photo Gallery Viral photos World most dangerous islands looks beautiful but deadly viral pics in social media
Dangerous Islands: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపాలు.. అక్కడికి వెళ్లారంటే.. ప్రాణాలతో చెలగాటమే!
Dangerous Islands: ప్రపంచంలో అందమైన ప్రదేశాలకు కొరత లేదు. అయితే కొన్ని ప్రదేశాలు అందమైనవి మాత్రమే కాదు చాలా...
Updated on: Jul 21, 2021 | 10:05 AM

ప్రపంచంలో అందమైన ప్రదేశాలకు కొరత లేదు. అయితే కొన్ని ప్రదేశాలు అందమైనవి మాత్రమే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా. ఇక సాహసాలకు వెనుకాడని కొంతమంది అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. మరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదు ద్వీపాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఫిలిప్పీన్స్‌లోని 'లుజోన్ ద్వీపం', దీనిని 'అగ్నిపర్వతం ద్వీపం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఓ యాక్టివ్ వాల్కనో ఉంది. దానిని 'టాల్ అగ్నిపర్వతం' అని అంటారు. అలాగే దాని బిలంలో అగ్నిపర్వత సరస్సు కూడా ఉంది. దాన్ని తాల్ సరస్సు అని పిలుస్తారు. దీన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఇక్కడికి వెళ్లడం ప్రమాదంతో ఆడుకోవటమే. ఎప్పుడు ఆ అగ్నిపర్వతం విస్పోటనం చెందుతుందో ఎవరికీ తెలియదు.

అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీపాన్ని 'సేబుల్ ఐలాండ్' అని పిలుస్తారు. 42 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు గల ఈ ద్వీపాన్ని 'ఐలాండ్ ఆఫ్ సాండ్', 'స్మశానవాటిక నది' అని కూడా పిలుస్తారు. 300కి పైగా నౌకలు ఇక్కడ కూలిపోయి మునిగిపోయాయి. దీనికి కారణం లేకపోలేదు. దూరం నుంచి ఇది సముద్రపు నీటిలా కనిపిస్తుంది. అందుకే చాలా ఓడలు వేగంగా వచ్చి కూలిపోతాయి.

ఇటలీకి చెందిన 'ఐసోల్ లా గయోలా' ద్వీపం శపించబడినదిగా పరిగణిస్తారు. నేపుల్స్ బేలో ఉన్న ఈ చిన్న ద్వీపం వెనుక భయకరమైన కథ ఉంది. దీనిని కొనుగోలు చేసే వ్యక్తి చనిపోవడం గానీ.. అతడి కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందని అంటుంటారు. ఇప్పటికే ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసిన చాలామంది మరణించారు. ప్రస్తుతం ప్రభుత్వం పరిధిలో ఉన్న ఈ ద్వీపానికి వచ్చే పర్యాటకులు రాత్రి అయ్యేసరికి అక్కడ నుంచి వెళ్లిపోతారు.

ఇది మయన్మార్‌లోని రామ్రీ ద్వీపం, దీనిని 'మొసళ్ల ద్వీపం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి, అవన్నీ ప్రమాదకరమైన మొసళ్ళతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

నెదర్లాండ్స్‌లోని ఈ ద్వీపం పేరు సాబా ద్వీపం. కేవలం 13 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ద్వీపంచూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యధిక సముద్ర తుఫానులను కలిగి ఉంది. ప్రస్తుతం, ఈ ద్వీపంలో సుమారు 2000 మంది నివసిస్తున్నారు.
