
ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అని దాని యజమాని పేర్కొన్నారు. రాణి అనే ఈ ఆవు ఢాకా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిగ్రామ్‌లోని ఒక పొలంలో నివసిస్తుంది. రాణి 66 సెం.మీ పొడవు, 26 కిలోలు బరువు ఉంటుంది.

ఈ ఆవు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన అతి చిన్న ఆవు కంటే 10 సెం.మీ చిన్నదని దాని యజమాని చెబుతున్నాడు.

గత మూడు రోజుల్లో 15 వేల మందికి పైగా రాణిని చూడటానికి వచ్చారు. ఆవు మాంసం బంగ్లాదేశ్‌లో ప్రసిద్ది చెందింది.

సోషల్ మీడియాలో రాణి చిత్రాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దానిని స్వయంగా చూడాలని కోరుకుంటున్నారు.