AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Istanbul: దేదీప్య‌మానంగా వెలిగిపోతున్న ఇస్తాంబుల్‌.. క‌నువిందు చేస్తోన్న నాసా అంత‌రిక్షం నుంచి పంపిన దృశ్యం..

Istanbul NASA Photos: ఈ విశ్వం ఎన్నో వింత‌ల‌కు మ‌రెన్నో అద్భుతాల‌కు నెల‌వు. మ‌రీ ముఖ్యంగా టెక్నాల‌జీ కార‌ణంగా రోజురోజుకూ అత్యంత వేతంగా మారుతోన్న భూగ్ర‌హంపై చోటుచేసుకునే ప‌రిణామాలు...

Istanbul: దేదీప్య‌మానంగా వెలిగిపోతున్న ఇస్తాంబుల్‌.. క‌నువిందు చేస్తోన్న నాసా అంత‌రిక్షం నుంచి పంపిన దృశ్యం..
Nasa Photo
Narender Vaitla
|

Updated on: May 28, 2021 | 4:59 PM

Share

Istanbul NASA Photos: ఈ విశ్వం ఎన్నో వింత‌ల‌కు మ‌రెన్నో అద్భుతాల‌కు నెల‌వు. మ‌రీ ముఖ్యంగా టెక్నాల‌జీ కార‌ణంగా రోజురోజుకూ అత్యంత వేతంగా మారుతోన్న భూగ్ర‌హంపై చోటుచేసుకునే ప‌రిణామాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. ఆకాశం నుంచి చూస్తే ఆ మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నేష‌న‌ల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ (నాసా) తాజాగా ట‌ర్కీ దేశంలోని ఇస్తాంబుల్ పట్ట‌ణం ఫొటోను పంపించింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెటిజెన్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఇంట‌ర్నేష‌నల్ స్పేస్ స్టేష‌న్ నుంచి భూమిపై ఉన్న ఇస్తాంబుల్ ప‌ట్ట‌ణాన్ని తీసిన ఫొటోను నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రాత్రి పూట జిగేల్ మంటూ క‌నిపిస్తోన్న ఇస్తాంబుల్ ప‌ట్ట‌ణం అందరినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోను నాసా పోస్ట్ చేస్తూ… `హే ఇస్తాంబుల్ నువ్వు వెలిగిపోతున్నావు. ఈ ఫొటోను మే 10, 2021 నాడు ఇంటర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ నుంచి తీసింది` అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. ఇక నాసా అప్పుడ‌ప్పుడు అంత‌రిక్షం నుంచి భూమిని ఫొటోలు తీయ‌డానికి గల కారణాన్ని వివ‌రిస్తూ.. `నాసా వ్యోమ‌గాములు ఇలాంటి చిత్రాల‌ను కేవ‌లం భూమిపై అంద‌మైన ప్ర‌దేశాల‌ను చూపించ‌డం కోసమే విడుద‌ల చేయ‌రు. దీంట్లో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ ఫొటోల ఆధారంగా భూ గ్ర‌హం ఎలా మారుతుందో తెలుసుకోవ‌చ్చు. ముఖ్యంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాలు, స‌హ‌జ సిద్ధ‌మైన ప్ర‌మాదాలైన లావా, వ‌ర‌ద‌లు భూమిని ఎలా మార్పుల‌ను లోను చేస్తున్నాయ‌న్న దానిపై ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది` అంటూ ఈ ఫొటోల వెన‌క ఉన్న అస‌లు ల‌క్ష్యాన్ని చెప్పుకొచ్చింది నాసా.

నాసా పోస్ట్ చేసిన ఇస్తాంబుల్ పట్ట‌ణ ఫొటో..

View this post on Instagram

A post shared by NASA (@nasa)

Also Read: Big Bang: విశ్వం పుట్టుక గురించి సరికొత్త విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Rahul gandhi: కరోనా మరణాలపై కేంద్రం చెబుతున్నది పచ్చి అబద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణ

Honda Bike: హోండా నుంచి విడుదల కానున్న మరో సరికొత్త బైక్‌.. అత్యాధునిక ఫీచర్లతో బైక్‌ తయారీ

Follow Us
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?