
వాస్తు నిపుణులు, ఇంట్లో మొక్కలను పెంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే? కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే మరికొన్ని మొక్కలు మాత్రం కష్టాలు , నష్టాలు తీసుకొస్తాయంట.కాగా, ఇంటిలో ప్రతి కూల శక్తిని పెంచి, సమస్యలను తీసుకొచ్చే మొక్కలు ఏవి అంటే?

బ్రహ్మజెముడు మొక్క : ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటికే అందం వస్తుంది. కానీ ఈ మొక్కను అస్సలే ఇంటిలో పెంచుకోకూడదంట. దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన దీని పదునైన ముళ్లు ఇంట్లో సంఘర్షణ వాతావరణం, అలాగే గొడవలకు కారణం అవుతుందంట. అందుకే వీటిని వీలైనంత వరకు బాల్కనీల వద్ద లేదా పెరట్లో మాత్రమే నాటుకోవాలంట.

స్నేక్ ప్లాట్ : ఈ మొక్క చాలా మంది తమ ఇంటిలో పెట్టుకుంటారు. దీని వలన ఇంటికి అందమే కాకుండా ఇది గాలిని శుద్ధి చేస్తుందని ప్రతి ఒక్కరు తమ ఇంటిలోపల ఈ మొక్కను పెంచుకుంటారు. అయితే ఈ మొక్కను ఇంటిలోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో పెట్టుకోవాలంట. దీని వలన సానుకూల శక్తి ఇంటిలో ప్రవేశిస్తుందంట.

లక్కీ వెదురు : చాలా మంది తమ ఇంటిలోపల లేదా కార్యాలయల్లో పెట్టుకునే మొక్కల్లో లక్కీ వెదురు ఒకటి. ఈ వెదురు కాకుండా సాంప్రదాయ, నిజమైన వెదురు మొక్కలను ఇంటిలోపల పెంచుకోకూడదంట. దీని వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెబుతున్నారు పండితులు.

తీగ దొండ : ఐవీ మొక్క. దీనిని తీగ దొండ అని కూడా అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట. దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందంట. అందుకేవీలైనంత వరకు ఈ మొక్కను ఇంటిలోప పెట్టుకోకూడదంట.