Money Plant Vastu: మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ ఇలా పెంచారంటే.. అప్పులు తీరి, మంచిరోజులు వచ్చినట్టే..!

Updated on: Nov 13, 2025 | 1:06 PM

చాలా మంది తమ ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. అపార్ట్‌ మెంట్లు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నవారు కూడా ఎండ, నీళ్లు ఎక్కువగా అవసరం లేని ఇండోర్ మొక్కలను కూడా పెంచుతున్నారు.. ఇది ఆ ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి, వాతావరణాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాంటి ఇండోర్‌ ప్లాంట్స్‌ విషయానికి వస్తే..ఎక్కువగా మనీ ప్లాంట్ పెంచుతారు. ఈ మొక్క అపారమైన ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్ముతారు. వాస్తులో ఈ మొక్కను సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఇంట్లో సరైన స్థానంలో నాటడం వల్ల సంపద పెరుగుతుందని కూడా విశ్వాసిస్తారు. అయితే, మనీ ప్లాంట్‌ వాస్తు నియామాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఇంట్లో మనీప్లాంట్‌ని పెంచుతున్నవారు తప్పనిసరిగా వాస్తుప్రకారం ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినది. ఇది శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి మొదలైన వాటికి కారకంగా చెబుతారు. ఇంట్లో సరైన దిశలో మనీ ప్లాంట్ ఉంటే శుక్రుడు కూడా సంతోషిస్తాడని, తద్వారా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని చెబుతారు.  మనీ ప్లాంట్‌ ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే, ఆ మొక్క దాని ప్రయోజనాలను అంతలా అందిస్తుంది.

2 / 5
మనీ ప్లాంట్ మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..ఇంటికి ఆగ్రేయ దిశకు అధిపతి వినాయకుడు, ప్రతినిధి శుక్రుడు. గణేశుడు అన్ని కష్టాలు, అడ్డంకులను తొలగిస్తాడు. శుక్రుడు ఇంట్లో సంపద, శ్రేయస్సు, గౌరవాన్ని పెంచుతుంది. అందుకే ఈ మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల ఆగ్నేయ దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయని నమ్మకం.

3 / 5
అలాగే, మనీ ప్లాంట్‌ను  ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదని చెబుతున్నారు. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ దిశకు అధిపతి బృహస్పతి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినది. బృహస్పతి, శుక్ర గ్రహాల మధ్య చెడు సంబంధం కారణంగా, ఇంట్లో ఈ దిశలో నాటిన మనీ ప్లాంట్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.

4 / 5
ఇకపోతే, మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతుంటే, వాటిని వెంటనే తొలగించాలని చెబుతున్నారు. మొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్లనివ్వండి. తీగను పెంచడం సంపద, శ్రేయస్సును ఇస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ తీగ నేలపై ఉంటే, ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది . శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది.

5 / 5
మీరు పనిచేస్తున్న చోట, ఆఫీసు కార్యాలయంలోనూ ఈ మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు. దీని కోసం, ఆకుపచ్చ, నీలం గాజు సీసాలో ఈ మొక్కను పెంచండి. ఈ విషయాలు డబ్బును ఆకర్షిస్తాయి. పురోగతికి కొత్త మార్గాలను సృష్టిస్తాయి. అదే సమయంలో, ఈ మొక్కను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. అయితే, ఈ మనీ ప్లాంట్​ మొక్కను ఎవరికీ ఇవ్వకూడదని అంటున్నారు. ఇలా చేస్తే శుక్రుడికి కోపం వస్తుందని అంటున్నారు. ఫలితంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.