
ఈ కవల ఆవు దూడలు.. రెండూ మగ, ఆడ దూడలు. ఈ దూడలు రెండు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి.. సాధారణంగా ఆవుకు పశువుల డాక్టర్ తో కృత్రిమ గర్భధారణ చేస్తుంటారు.

ఇలాంటి సందర్భాలలోనే ఆవు ఒకే ఈతలో కవలదూడలు జన్మించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన ఆవులు కావాలని దూడలు జన్మించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

జన్మించిన రెండు మగ, ఆడ దూడలకు జన్మనివ్వడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇలా అరుదుగా జరుగుతుందని పశు వైద్యాధికారి తెలిపారు.

ఒకేసారి రెండు అండాలు విడుదలైనప్పుడు లేదా ఒక అండం రెండుగా విభజన చెందిన తరువాత ఫలదీకరణ జరిగితే కవల దూడలు జన్మిస్తాయని చెప్పారు.

దేశవాళీ ఆవులు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడలకు జన్మనిస్తున్నాయని పశువుల డాక్టర్ పేర్కొన్నారు.