FIFA World Cup 2022 Final: అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆదివారం జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మార్చేయగల టాప్ 10 ఆటగాళ్లు వీళ్లే..
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో లూసెయిస్ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య పోరు జరగపోతుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చివేయగల సత్తా ఉన్న ఇరు జట్లలోని టాప్ 10 ప్లేయర్లపై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..

Fifa World Cup Final
- అర్జెంటీనా జట్టుకు లియోనెల్ మెస్సీ గుండె ఇంకా వెన్నెముక అని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో అతను ఇప్పటి వరకు ఐదు గోల్స్ చేశాడు. స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పుడల్లా ఎందరో డిఫెండర్లను ఒకేసారి తప్పించగల శక్తి మెస్సీకి ఉంది.
- టోర్నమెంట్ సాగుతోన్న కొద్దీ జూలియన్ అల్వారెజ్.. అర్జెంటీనా తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అతను ఇప్పటివరకు నాలుగు గోల్స్ చేశాడు. వేగంగా పరిగెత్తడంలో ఈ ఆటగాడికి సాటి లేదు. క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్స్‌లో 3-0తో జట్టు విజయంలో జూలీయన్ కూడా ప్రముఖ పాత్ర పోషించాడు.
- అర్జెంటీనాకు నాహుయెల్ మోలినా ఒక ఫుల్ బ్యాక్ ప్లేయర్ మాత్రమే కాక బలమైన డిఫెండర్. అట్లెటికో మాడ్రిడ్‌కు చెందిన మోలినా తన దూకుడు వైఖరితో మరింత ప్రసిద్ధిపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ స్ట్రైకర్లకు మోలినా పెద్ద సవాలుగా మారనున్నాడు.
- ఎంజో ఫెర్నాండెజ్ టోర్నమెంట్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ప్రారంభించాడు. అయితే అర్జెంటీనా విజయంలో భాగంగా మెక్సికోపై అతను గోల్ చేయడంతో జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. అతను అర్జెంటీనా మిడ్‌ఫీల్డ్‌లో కీలక ఆటగాడు.
- ఎమిలియానోమార్టినెజ్ అర్జెంటీనా తరఫున పెనాల్టీ షూటౌట్లో కీలకపాత్ర పోషించగల గోల్ కీపర్. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు చేరుకుంటే మార్టినెజ్ పాత్ర కీలకం కానుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
- అర్జెంటీనాకు ఫ్రాన్స్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పే అతిపెద్ద ముప్పు అని చెప్పుకోవాలి. తన వేగం, గోల్ స్కోరింగ్ నైపుణ్యంతో ప్రసిద్ధి చెందిన కైలియన్ ఈ టోర్నీలో మెస్సీతో సమానంగా ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు.
- టోటెన్హామ్ తరఫున ఆడుతున్న హ్యూగో లోరిస్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అతను ఎక్కువగా మాట్లాడకపోవచ్చు కానీ తన ఆటను బాగా ఆడతాడు. ఫ్రాన్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లోరిస్ రికార్డు సృష్టించాడు.
- 29 ఏళ్ల రాఫెల్ వెరాన్ ఫ్రాన్స్ డిఫెన్స్‌లో బలమైన లింక్ ప్లేయర్. రాఫెల్ తన కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడినా చాలా కీలక ప్లేయర్. రియాల్ మాడ్రిడ్ నాలుగు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలవడంలో అతనిది కీలక పాత్ర.
- గత నాలుగేళ్లుగా పాల్ పోగ్బా స్థానంలో ఫ్రాన్స్‌లో మిడ్‌ఫీల్డ్‌లో ఆరేలియన్ చుమేనీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిడ్‌ఫీల్డ్‌లో అతనిని అధిగమించడం అర్జెంటీనాకు కష్టమవుతుంది.
- ఆంటోయిన్ గ్రీజ్‌మాన్














