AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేస్టీగా ఉన్నాయని కుమ్మేయకండి!.. ఒంట్లో మహమ్మారి తయారయ్యాక.. తల పట్టుకోకండి!

ఫ్రెంచ్ ఫ్రైస్.. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వారంలో ఇకసారి తినడం ఒకే.. కానీ అలా కాదని వారానికి మూడు నాలుగు సార్లు తిన్నారో. మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నవారు అవుతారు. ఇది మేము చెబుతున్న విషయం కాదు. ప్రఖ్యాత హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని అధికంగా తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం ఉందని హెచ్చరిస్తున్నారు.

Anand T
|

Updated on: Aug 07, 2025 | 11:10 PM

Share
సుమారు 2,05,000 మంది ఆహారపు అలవాట్లను 30 ఏళ్లకు పైగా పరిశీలించి, అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్థారించినట్టు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు.

1 / 5
30 ఏళ్లలో మొత్తం 2,05,000 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించగా వారిలో 22,299 మంది డయాబెటిస్ బారిన పడినట్లు గుర్తించారు. వారి ఆహారపు అలవాట్లను పరిశీలించినప్పుడు ఫ్రెంచ్‌ ప్రైజ్‌ తినండం కారణంగానే వాళ్లు డయాబెటీస్‌ బారిన పడినట్టు కనుగొన్నారు.

2 / 5
అయితే ఈ అధ్యయనం ద్వారా డయాబెటీస్‌ వస్తుందని కనుగొన్న పరిశోదకులు ఇందుకు పరిష్కారాన్ని కూడా సూచించారు. మన ఫుడ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్‌కు బదులుగా తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ 19 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు.

3 / 5
ఈ అధ్యయనాన్ని చేపట్టిన ప్రొఫెసర్ వాల్టర్ విల్లెట్ మాట్లాడుతూ మన రోజువారీ ఆహారంలో చేసుకునే కొన్ని మార్పులే ఈ డయాబెటిస్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ను వినియోగాన్ని తగ్గించి, తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా మధుమేహం ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.

4 / 5
అయితే, ఉడకబెట్టినా లేదా బేక్ చేసినా  ఆలుగడ్డలను తినడం వల్ల అలాంటి ప్రమాదమేమీ ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.( గమనిక: పైన పేర్కొన్నా అంశాలు నివేదికలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే అందిచబడ్డాయి. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)

5 / 5