Thyroid: ఏ విటమిన్ లోపిస్తే థైరాయిడ్ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా? ఈ తప్పులు అస్సలు చేయకండి..
నేటి గజిబిజీ లైఫ్‌లో థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణమైపోయాయి. యువతలో ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు థైరాయిడ్ సమస్యలతో ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. థైరాయిడ్ ప్రాథమికంగా హార్మోన్ గ్రంధి. ఈ గ్రంథి మెడ దగ్గర ఉంటుంది. జీవక్రియను నిర్వహించడం నుంచి శరీర అంతర్గత పనితీరులో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది..
Updated on: May 07, 2024 | 8:41 PM

నేటి గజిబిజీ లైఫ్‌లో థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణమైపోయాయి. యువతలో ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు థైరాయిడ్ సమస్యలతో ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

థైరాయిడ్ ప్రాథమికంగా హార్మోన్ గ్రంధి. ఈ గ్రంథి మెడ దగ్గర ఉంటుంది. జీవక్రియను నిర్వహించడం నుంచి శరీర అంతర్గత పనితీరులో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి నుంచి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే, ఈ హార్మోన్ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ లేదా తక్కువగా స్రవిస్తుంది. ఇది థైరాయిడ్ వ్యాధికి దారి తీస్తుంది.

థైరాయిడ్ గ్రంధి నుంచి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే, ఈ హార్మోన్ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ లేదా తక్కువగా స్రవిస్తుంది. ఇది థైరాయిడ్ వ్యాధికి దారి తీస్తుంది.

థైరాయిడ్ గ్రంధి సమస్యలకు ఒక కారణం శరీరంలో విటమిన్ డి లోపం. ఈ విటమిన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఆహారంలో విటమిన్-డి అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ కోసం చీజ్ కూడా మెను ఐటెమ్‌లో చేర్చుకోవచ్చు.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలలో గుడ్లు ఒకటి. ఇది విటమిన్-డి లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందువల్ల పిల్లలు, వృద్ధులు, రోగులు ప్రతిరోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ప్రతిరోజూ గుడ్లు తినకూడదు.

Tపుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్-డి అధికంగా ఉంటుంది. ఫలితంగా పుట్టగొడుగులు శరీరంలో విటమిన్ డి లోపాన్ని పూరిస్తాయి. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.




