కోటా శ్రీనివాసరావు జీవితాన్నే మార్చిన ఒకే ఒక్క సినిమా ఇదే?

Updated on: Jul 13, 2025 | 9:46 AM

టాలీవుడ్ సీనియర్ నటడు కోటా శ్రీనివాస్ రావు ఈరోజు(ఆదివారం) ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు. విలన్ పాత్రల్లోనైనా, కమెడియన్ పాత్రల్లో నైనా, తండ్రిగా, తాతగారిగా ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే స్వభావం ఈయనది. ముఖ్యంగా విలనిజంలో ఈయనను మించిన నటడు లేరన్నది వాస్తవం.

1 / 5
టాలీవుడ్ సీనియర్ నటడు కోటా శ్రీనివాస్ రావు ఈరోజు(ఆదివారం) ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు. విలన్ పాత్రల్లోనైనా, కమెడియన్ పాత్రల్లో నైనా, తండ్రిగా, తాతగారిగా ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే స్వభావం ఈయనది. ముఖ్యంగా విలనిజంలో ఈయనను మించిన నటడు లేరన్నది వాస్తవం. అంతలా ఈయన నటనకు ప్రాణం పోశారు. అయితే కోటా శ్రీనివాసరావు చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఈయన జీవితాన్ని మార్చింది మాత్రం ఒకే ఒక్క సినిమా అంట. కాగా, ఆ మూవీ ఏదో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
తెలుగు వెండితెర విలక్షణ నటుడు కోటాశ్రీనివాసరావు, 1978 లో ప్రాణం ఖరీదు మూవీతో తెలగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.  తొలిసినిమాతోనే ఈయన తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయినప్పటికీ ఈయనకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదంట.  చాలా తక్కువగా ,చిన్న చిన్న పాత్రల్లో అవకాశాలు మాత్రమే దక్కాయి.

3 / 5
అయినప్పటికీ కోటా శ్రీనివాసరావు వెనకడుగు వేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాడు. తర్వాత 1985లో ఈయనకు వందేమాతరం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది . దాదాపు చిత్రపరిశ్రమలోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత ఈయన నటనకు సరైన గుర్తింపు దక్కేలా చేసిన సినిమా వందేమాతరం.

4 / 5
ఇక ఈ మూవీ తర్వా కోటా శ్రీనివాసరావు విజయశాంతి కీలక పాత్రలో నటించిన ప్రతి ఘటన సినిమాలో ఛాన్స్ రావడంతో, ఈ మూవీలో విలన్ పాత్రలో అదరగొట్టి విలనిజానికే కొత్త అర్థం తీసుకొచ్చారు . ఈ మూవీతో ఈయన జీవితం ఒక్కసారిగా మారిపోయిందంట. ప్రతిఘటన సినిమాలో కోటా తన పాత్రకు ప్రాణం పెట్టి నటించారు అనడంలో అతిశయోక్తి లేదు.

5 / 5
ఎందుకంటే? ఈ సినిమా విజయంలో కోటా పాత్ర కూడా కీలకం. ఇక ఈ సినిమా తర్వాత కోటా శ్రీనివాసరావు చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. విలక్షణ నటుడిగా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు.. ఇలా ఒక్కో పాత్రలో ఒక్కో రకంగా తన నటవిశ్వరూపం చూపించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.