ఆ హీరోపై ప్రత్యేక అభిమానంతో.. కోటా శ్రీనివాస రావు చివరగా నటించిన సినిమా ఏదో తెలుసా?

Updated on: Jul 14, 2025 | 6:54 PM

కోటా శ్రీనివాసరావు మరణ వార్త ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తుంది. ఆయన అనారోగ్యంతో జూన్ 13 ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఈయన ఆదివారం తన తుది శ్వాస విడిచారు.

1 / 5
కోటా శ్రీనివాసరావు మరణ వార్త ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తుంది. ఆయన అనారోగ్యంతో జూన్ 13 ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఈయన ఆదివారం తన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన చివరి శ్వాస వరకు నటిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే కోటా శ్రీనివాసరావు నటించిన చివరి సినిమా గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కాగా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
తెలుగు వెండితెరపై పాత్ర ఏదైనా సరే తన నటనావిశ్వరూపంతో ఎంతో మందిని ఆకట్టుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు.  విలన్ పాత్రల్లోనైనా, కమెడియన్ పాత్రల్లో నైనా, తండ్రిగా, తాతగారిగా, పిసినారిగా, కోపోద్రోకుడిగా, ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే స్వభావం ఈయనది. ముఖ్యంగా విలనిజంలో ఈయనను మించిన నటడు లేరన్నది వాస్తవం.ఈయన చాలా సినిమాల్లో విలన్‌గా నటించి  విలనిజానికే కొత్త పేరు తీసుకొచ్చారు.

3 / 5
ఇక కోటా శ్రీనివాస రావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ మూవీ చిరంజీవి మొదటి సినిమా. ఈ మూవీతో చిరంజీవికి, కోటా శ్రీనివాసరావు తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. కానీ ఈ మూవీ కోటాకు అంతగా గుర్తింపు తీసుకరాలేకపోయింది.  కానీ ఈ మూవీ తర్వాత కోటా వందే మాతరం, ప్రతిఘటన వంటి సినిమాల్లో నటించి , తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయనకు ఎన్నో అవకాశాలు రావడం జరిగిందంట. దీంతో చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

4 / 5
కోటా శ్రీనివాసరావు చాలా వరకు సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. అయితే ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా ఓ సినిమాలో నటించడాడంట. అంతే కాకుండా అదే ఆయన చివరి సినిమా అంట. ఇంతకీ ఆ సినిమా ఏదీ అనుకుంటున్నారా? కోటా శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న పవన్ హరిహర వీరమల్లు సినిమాలో నటించారంట.

5 / 5
అయితే కోటా అనారోగ్యంగా ఉన్నప్పటికీ పవన్ కోసం ఆ సినిమాలో నటించడం విశేషం. ఇక కోటా శ్రీనివాసరావు దాదాపు 750పైగా సినిమాల్లో  వివిధ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన ప్రాణం ఖరీదు మొదటి సినిమా కాగా, హరిహర వీరమల్లు చివరి సినిమా. ఇక ఈ సినిమా జూలై24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.