Healthy Bones: తియ్యని శత్రువు.. వీటిని తిన్నారంటే మీ ఎముకలు నుజ్జు కావడం ఖాయం!
These foods absorb calcium from bones: కాల్షియం.. ఒంట్లో ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా రక్తపోటు, కండరాల నియంత్రణ, కణాల పనితీరును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఎముకలను బలహీనపరిచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కాల్షియం శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది ఒంట్లో ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా రక్తపోటు, కండరాల నియంత్రణ, కణాల పనితీరును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఎముకలను బలహీనపరిచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శీతల పానీయాలు (సోడా)
ముఖ్యంగా శీతల పానీయాలను నేటి కాలంలో చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు. అయితే ఇవి తాగడం వల్ల ఒంట్లో కాల్షియం లోపానికి కారణమవుతాయి. ఈ పానీయాలలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణను నిరోధిస్తుంది. దీని కారణంగా ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. కాబట్టి శీతల పానీయాలు తాగడం తగ్గించాలి.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం
ఎర్ర మాంసం (మేక మటన్), ప్రాసెస్ చేసిన మాంసం (ఉదా. సాసేజ్, బేకన్, హాట్ డాగ్స్) తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తాయి. ఇది ఎముకలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పదార్ధం శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.
కేకులు, క్యాండీలు, కుకీలు
కేకులు, క్యాండీలు, కుకీలు వంటి తీపి, ప్రాసెస్ చేసిన బేకరీ ఆహారాల్లో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఈ ఆహారాలు శరీరంలో మంటను కలిగిస్తాయి. అవి ఎముకలను బలహీనపరుస్తాయి. అందుకే తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి.
టీ, కాఫీ
టీలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తుంది. మీరు ఎక్కువగా టీ తాగితే మీ ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల ఎముకల నుంచి కాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. కాబట్టి టీ, కాఫీ తాగడం తగ్గించి, నీళ్లు, ఇతర కాల్షియం అధికంగా ఉండే పానీయాలు తీసుకోవాలి.
ఆల్కహాల్
ఆల్కహాల్ తాగడం వల్ల ఎముకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తుంది. ఇది మీ ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది పెళుసు ఎముకలకు కారణమవుతుంది. ఎముక పగుళ్ల రేటు పెరుగుతుంది. మీకు బలమైన ఎముకలు కావాలంటే మద్యం సేవించడం వెంటనే మానేయాలి.
నూనె పదార్థాలు
సమోసాలు, వేయించిన చికెన్, బజ్జీ వంటి నూనె పదార్థాలు రుచికి భలేగా ఉంటాయి. వీటిల్లోని కొవ్వు , అసమతుల్య కొవ్వులు శరీరంలో వాపుకు కారణమవుతాయి. దీనివల్ల శరీరంలో కాల్షియం శోషణ తగ్గుతుంది. ఎముకలు బలహీనపడతాయి. ఈ ఆహారాల వినియోగాన్ని కనిష్టంగా తగ్గించాలి. బదులుగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








