చేతి గాజులు పగలకుండా ఎక్కువ రోజులు ఉండాలా.. టిప్స్ పాటించాల్సిందే
ఆడవారికి అందం తీసుకొచ్చే వాటిల్లో గాజులు ముందుంటాయి. రంగు రంగుల గాజులతో మగువలు అందంగా మెరిసి పోతుంటారు. అంతే కాకుండా గాజులు భారతీయ మహిళల సౌభాగ్యానికి ప్రతీక అంటారు. అంతే కాకుండా హిందూ సంప్రదాయంలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గాజులు అనేవి త్వరగా పలిగిపోతుంటాయి. కాగా, అలా పగలకుండా ఉండాలంటే ఓ మహిళ చెప్పిన టిప్స్ పాటించాల్సిందే అవి ఏవి అంటే.
Updated on: May 31, 2025 | 9:02 PM

ఆడవారికి చేతికి గాజులు అందం. అంతే కాకుండా భారతీయ మహిళా సంప్రదాయానికి ప్రతీక గాజులు. ముఖ్యంగా పెళ్లైన వారు తప్పకుండా చేతినిండా గాజులు ధరించాలని చెబుతుంటారు. ఇక మార్కెట్‌లోకి అనేక రకాల గాజులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మట్టిగాజులు, సీసపు గాజులను ఎక్కువగా వాడుతుంటారు.

అయితే గాజులు అనేవి చాలా సున్నిమై వీటిని సరిగ్గా భద్రపరచుకోకపోతే త్వరగా పగిలిపోతాయి. అందుకే మహిళలు గాజుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని వాటిని చాలా భద్రంగా దాచుకుంటారు.

ఇక గాజులను ఎంత భద్రంగా దాచుకున్నప్పటికీ అవి కొన్ని సార్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే గాజులు త్వరగా పగిలి పోకుండా, ఎక్కువ రోజుల పాటు దఅవ పాడవకుండా మన్నికగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ మహిళ గాజులు త్వరగా పగలగుండా ఎక్కువ రోజులు ఉండటానికి ఎలాంటి టిప్స్ పాటించాలో తెలిపింది. కాగా,మహిళ వీడియోలో ఎలాంటి సహాలు ఇచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గాజులను బ్రాస్లెట్లు, గాజు బ్రాస్లెట్లు అమర్చిన చోట పెట్టడం వలన అవి త్వరగా పాడైపోతాయంట. అలాగే గాజులు పగలగుండా ఎక్కువ రోజులపాటు ఉండాలంటే, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో నీరు పోసి ఆ నీరు వేడి అయిన తర్వా గాజులను కాసేపు అందులో మరిగించాలంట. తర్వాత ఆ గాజులను బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వాటిని వేసుకుంటే ఎక్కువ రోజులు పగలగుండా మన్నికగా ఉంటాయంట.



