- Telugu News Photo Gallery These are the things in your kitchen that cause cancer...Know and change immediately Kitchen Hacks
Kitchen Hacks: మీ కిచెన్ లో క్యాన్సర్‌కు కారణం అయ్యే వస్తువులు ఇవే…వెంటనే తెలుసుకొని మార్చేయండి..
క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చికిత్స లేదు. క్యాన్సర్ వస్తే బతకడం చాలా కష్టమని తెలుసు. అందుకే క్యాన్సర్ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాలి.
Updated on: Apr 05, 2023 | 9:00 AM

క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చికిత్స లేదు. క్యాన్సర్ వస్తే బతకడం చాలా కష్టమని తెలుసు. అందుకే క్యాన్సర్ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా నివారంచడం చాలా మంచిది. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోషకాహారం తీసుకుంటే క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉంటే దీన్ని నిరోధించవచ్చు.

మనం కిచెన్ లో వాడే కొన్ని వస్తువులు క్యాన్సర్ కారకమవుతాయని మీకు తెలుసా. అవును మనం వంటగదిలో వాడే కొన్ని వస్తువులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాంటి వస్తువులను వాడే ముందుకు కాస్త ఆలోచించడం చాలా ముఖ్యం. ఆ వస్తువులెంటో చూద్దాం.

ప్లాస్టిక్ డబ్బాలు చాలా మంది కిచెన్ లో రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలను వాడుతుంటారు. అందులో ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంటారు. కానీ ఈ ప్లాస్టిక్ డబ్బాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ప్లాస్టిక్ డబ్బాలలో కనిపించే BPA( బిస్ఫినాల్స్ A) మీ సహజ హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.

నాన్ స్టిక్ పాన్స్ ఈ మధ్య చాలా మంది నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారు. కిచెన్ లో నాన్ స్టిక్ పాత్రలు ఉంటే ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతుంటారు. కానీ నాన్ స్టిక్ పాన్లలో వండిన ఆహారం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇందులో PFOA(పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్) ఉంటుంది. ప్యాన్ లను వేడి చేయడం ద్వారా అవి విడుదల అవుతాయి. దీంతో పలు రకాల క్యాన్సర్ లకు దారి తీస్తుంది. వ్రుషకణాలు అండాశయాలు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ప్యాక్డ్ ఆహారం చాలా మంది వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ మూతలున్న డబ్బాల్లో స్టోర్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే బీపీఏతో కప్పబడిన టిన్లలో ప్యాక్ చేస్తే విషపూరితం మీ శరీరంలో క్యాన్సర్ కణాలకు ఆజ్యం పోస్తుంది.

శద్ధి చేసిన నూనె: రిఫైన్డ్ ఆయిల్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది.

ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డ్ కూరగాయలు కట్ చేయడానికి చాలా మంది ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డ్స్ వాడుతుంటారు. వాటి స్థానంలో చెక్కతో తయారు చేసిన బోర్డులను ఎంచుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు మీ ఆహారంలోకి ప్రవేశించి క్యాన్సర్ కు కారణం అవుతాయి.

పాల ఉత్పత్తులు పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులు కాలేయం, రొమ్ము క్యాన్సర్ ను డెవలప్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పరిశోధకులు తెలిపారు.

డైట్ సోడా pLOS మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మీ డైట్ సోడాలో కనిపించే క్రుతిమ స్వీటెనర్ లు క్యాన్సర్ ను డెవలప్ చేసే 13శాతం అధిక ప్రమాదానికి కారణమవుతాయి.

సబ్బులు, క్లీనర్లు థాలేట్స్, పారాబెన్లు, సల్ఫేట్స్ కలిగి ఉండే సబ్బులు క్యాన్సర్ కారకాలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణమయ్యే ఏజెంట్లు.



