- Telugu News Photo Gallery These are the precautions to take during thunderstorms and lightning during the rainy season
వర్షంతో పాటు ఉరుములు, మెరుపులా.. తప్పకుండా ఈ టిప్స్ పాటించండి!
రోహిణికార్తెతో ఎండలు పోయి మృగశిర కార్తెతో వర్షకాలం ప్రారంభమైంది. ఆకాశం నిండా మేఘాలతో చిన్న చిన్న చిరుజల్లులు,కొన్ని సార్లు భారీ వర్షం కురుస్తుంటుంది. వర్షం పడే టప్పుడు ఉరుములు, మెరుపులు, గాలి రావడం అనేది చాలా కామన్. ఇక ఉరుములు, మెరుపులకు చాలా మంది భయపడిపోతుంటారు. కొన్ని సార్లు పిడుగులు పడి కొంత మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే పిడుగుల నుంచి మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు ఈ చిట్కాల ద్వారా తెలుసుకుందాం.
Updated on: Jun 14, 2025 | 11:00 AM

నైరుతి రుతుపవనాలు మొదలు అయ్యాయి. దీంతో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొన్ని సార్లు పిడుగులు కూడా పడటం, పిడుగుల ధాటికి పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇది అందరిలో ఆందోళనను కలిగిస్తుంది.అందుకే పిడుగులు పడకుండా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి :

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షంపడే సమయంలో వీలైనంత వరకు బయటఉండకపోవడమే మంచిదంట. ఒక వేళ ఉన్నట్లైతే అత్యవసరం కాదు అనుకున్నప్పుడు త్వరగా ఇంటికి చేరిపోవాలంట. దూర ప్రయాణాలు అస్సలే చేయకూడదంట.అంతే కాకుండా చేపలు పట్టడం, జంతువులను మేపడం కూడా చేయకూడదంట.

అదే విధంగా, సరస్సులు, జలాశయాలు, చిత్తడి నేలలకు దూరంగా ఉండాలంట. అలాగే ఎత్తైన భవనాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పిడుగులు తరచుగా ఎత్తైన ప్రదేశాలను తాకుతాయి. టవర్లు, విద్యుత్ స్తంభాలు లేదా పొడవైన చెట్ల పై ఎక్కువగా పిడుగులు పడుతాయి. అందుకే వీటి వద్దకు అస్సలే వెళ్లకూడదంట.

పిడుగులు పడే సమయంలో విద్యుత్ ఉపకరణాలను అస్సలే ఉపయోగించకూడదంట.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేదా విద్యుత్ స్టవ్‌లను ఆఫ్ చేసి, వాటికి దూరంగా ఉండాలంట. విద్యుత్ స్విచ్‌లు లేదా స్విచ్‌బోర్డుల దగ్గర ఉండకూడదుజ. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవద్దు. మెరుపులు వచ్చే సమయంలో నేలపై కూర్చోవడం ఉత్తమం. ఒక వేళ మీరు బయట ఉన్నా సరే నేలపై కూర్చోవడం ఉత్తమం.