ఏప్రిల్ నెలలో జాలీగా జాలీగా.. సమ్మర్ టూర్‌కి సౌత్ ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే!
వేసవి వచ్చిందంటే చాలు అందరూ చాలా ఫ్రీ అయిపోతారు. ముఖ్యంగా పిల్లలకు కూడా వేసవి సెలవులు రావడంతో, ఫ్యామిలీ, స్నేహితులందరూ జాలీ జాలీగా ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సమ్మర్ చాలా సంతోషంగా, ఆనందంగా గడపాలి అనుకుంటే సౌత్ ఇండియాలో ఉన్న ఈ ప్లేసెస్‌కు వెళ్లాల్సిందేనంట. ఇంతకీ అవి ఏవో చూసేయండి మరి!
Updated on: Mar 28, 2025 | 2:49 PM

వల్పరై, తమిళనాడు : వేసవి చాలా ఎంజాయ్ చేయాలి. ముఖ్యంగా పచ్చని చెట్ల మధ్య విహరిస్తూ ఆనందంగా గడపాలి అనుకుంటున్నారు. అందుకు బెస్ట్ ప్లేస్ వల్పరై. తమిళనాడులో అంతగా తెలియని హిల్ స్టేషన్ వల్పరై. ఈ ప్రాంతమంతా తేయాకు తోటలు, జలపాతాలు, సుందరమైన లోయలతో నిండి ఉంటుంది.సమ్మర్ అందమైన ప్రాంతాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే.

ఏప్రిల్ నెలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? దానికి బెస్ట్ ప్లేస్ కేరళలోని మున్నార్. ఇక్కడ అందమైన పూల తోటలు, తేయాకు తోటలు , జలపాతాలు , సుగంధ ద్రవ్యాల తోటలు ఇవన్నీ కనులవిందునిస్తాయి. అంతేకాకుండా, అంతరించిపోతున్న నీలగిరి తహర్‌ను చూడటానికి ఎరవికులం జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడానికి ఇది అనువైన సమయం.

అరకు లోయ, ఆంధ్రప్రదేశ్ :కాఫీ తోటలతో, కొండలు నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే అరకు లోయ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్రిల్ నెలలో ఇక్కడికి వెళ్లారంటే ఆ ఆనందం మాములుగా ఉండదు. ఇక్కడి ప్రకృతి, గిరిజన సంసృతి, సున్నపురాయి నిర్మాణాలు, బొర్రా గుహలు, కొండులు, పచ్చటి అడవి, కాఫీ తోటలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. వేసవిలో ఎంజాయ్ చేయడానికి ఏపీలోని అరకులోయకు తప్పకుండా వెళ్లాల్సిందే.

హంపి, కర్ణాటక : సమ్మర్ టూర్‌లో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉన్నదా అంటే, హంపి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి పూరాతన దేవాలయాలు చూడటానికి చాలా బాగుంటాయి. సైకిల్ ప్రయాణం చేస్తూ ఇక్కడి ఉన్న పురాతన దేవాలయాలు, బండరాళ్లతో నిర్మించబడిన గుళ్లు, పచ్చటి ప్రకృతిని చూస్తూ చాలా ఎంజాయ్ చేయవచ్చును.

గోకర్ణ, కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ్ పశ్చిమ తీరపాత్రంతంలో ఉంది. ఈ బీచ్ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఇధి గోవాకు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, చల్లటి గాలి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.





























