Apple for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఓ యాపిల్‌ను ఈ సమయంలో తినండి..

Updated on: Mar 05, 2024 | 8:37 PM

రోజూ ఒక యాపిల్ తింటే రోగాల నుంచి దూరంగా ఉండటం 'గ్యారంటీ' అంటున్నారు నిపుణులు. అంతేకాదు బరువు కూడా సులువుగా తగ్గొచ్చంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే యాపిల్‌ రోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. యాపిల్స్‌లో కేలరీలు ఉండవు. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్స్‌లోని సహజ చక్కెరలు కూడా ఆకలిని తీరుస్తాయి. అందుకే రోజు బ్రేక్‌ ఫాస్ట్‌కి బదులుగా యాపిల్‌ తినాలని నిపుణులు సిఫార్స్‌ చేస్తున్నారు. ఇలా చేస్తే యాపిల్స్ బరువు తగ్గొచ్చట..

1 / 5
బరువు తగ్గడానికి దొహదపడే పండ్లలో ఆపిల్ ఒకటి. యాపిల్ తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ప్రాంతంలో కొవ్వు తగ్గడానికి సహకరిస్తుంది. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు యాపిల్ తొక్కతో తినాలి. ఎందుకంటే యాపిల్ పండు తొక్కలో క్వెర్సెటిన్ అనేది ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి దొహదపడే పండ్లలో ఆపిల్ ఒకటి. యాపిల్ తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ప్రాంతంలో కొవ్వు తగ్గడానికి సహకరిస్తుంది. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు యాపిల్ తొక్కతో తినాలి. ఎందుకంటే యాపిల్ పండు తొక్కలో క్వెర్సెటిన్ అనేది ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

2 / 5
మరిన్ని ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఒక యాపిల్‌ తినాలి.అలాగే, బరువు తగ్గాలనుకునే వారు ఈ కింది 5 విధాలుగా యాపిల్ తినడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. అల్పాహారం లో ఆపిల్ ఉంచవచ్చు. యాపిల్‌ను ముక్కలుగా కట్ చేసుకుని, దాని మీద పీనట్స్‌ వెన్న రాసి తినాలి. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి.

3 / 5
ఉదయాన్నే ఉద్యోగాలకు పరుగుల తీసేవారు కూర్చుని యాపిల్ తినడానికి తగిన సమయం ఉండదు. ఓట్స్, పెరుగు, బాదం, యాపిల్స్‌తో కలిపి స్మూతీని తయారు చేసుకుని తాగవచ్చు. యాపిల్ స్మూతీస్ కూడా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. పైగా రోజంతా పని చేయడానికి తగిన శక్తిని ఇస్తాయి.

4 / 5
లంచ్‌లో కూడా ఆపిల్ తినవచ్చు. అలాగే చికెన్-యాపిల్ ర్యాప్, ఆపిల్ శాండ్‌విచ్ వంటి ఆహారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఆపిల్‌తో వివిధ రకాల డెజర్ట్‌లను తయారు చేసుకోవచ్చు. మీరు తక్కువ కేలరీల డెజర్ట్ తినాలనుకుంటే ఆపిల్ పై, ఆపిల్ టార్ట్ లేదా పుడ్డింగ్ వంటి ఆహారాన్ని తయారు చేయవచ్చు.

5 / 5
యాపిల్స్‌లోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్స్‌లోని ఫైబర్‌ను పెక్టిన్ అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఆపిల్‌లో 1 గ్రాము ఫైబర్ ఉంటుంది.