
మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలా మందికి మంట అనేది వస్తుంది. దీన్ని డైసూరియా సమస్య అని అంటారు. ఈ సమస్య ఎక్కువగా చెడు ఆహారాలు తినడం వల్ల, నీటిని ఎక్కువగా తీసుకోక పోవడం వల్ల వస్తుంది. మీకు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నట్లయితే.. దీన్ని అస్సలు లైట్ తీసుకోకండి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రంలో చికాకు కలుగుతుంది. దీని వల్ల విపరీతమైన మంట వస్తుంది. ఈ సమస్య అనేది మహిళల్లో చాలా కామన్ విషయం. పెద్ద పేగు నుంచి వచ్చే బ్యాక్టీరియా మూత్రం మార్గంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమస్య అనేది వస్తుంది.

మూత్ర పిండాల్లో రాళ్లు ఉండటం వల్ల కూడా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట వస్తుంది. ఈ మధ్య చాలా మంది మూత్ర పిండాల్లో రాళ్లు చేరుతున్నాయి. ఈ రాళ్లు కొన్ని సార్లు మూత్రాశయంలో చిక్కుకుపోవడం వల్ల కూడా మూత్రంలో మంట అనేది కలుగుతుంది.

అండాశయాల్లో తిత్తులు ఉన్నప్పుడు కూడా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట వస్తుంది. అంతే కాకుండా డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అంతే కాకుండా ఎక్కువగా వేయించిన ఆహారాలు తీసుకుంటే ఇలా అవుతుంది.

ముఖ్యంగా నీటిని చాలా తక్కువగా తాగడం వల్ల కూడా మూత్ర విసర్జన సమయంలో మంట అనేది వస్తుంది. చాలా మంది తక్కువగా నీటిని తాగుతారు. దీని వల్ల కూడా మంట కలుగుతుంది. మూత్రం కొద్దికొద్దిగా తరచుగా వస్తుంది. ఇలాంటి అప్పుడు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి.