AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్త్రీల మానసిక ఆరోగ్యంపై పీరియడ్స్ ప్రభావం..నిపుణుల సూచనలేమిటంటే?

స్త్రీలల్లో పీరియడ్స్ అనేది కామన్ ప్రక్రియ. ఈ సమయంలో చాలా వరకు మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయి ఉండటమే కాకుండా వారి మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక ప్రతి నెల జరిగే ఈ ప్రక్రియ మహిళల శారీక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దీని నుంచి వారు ఎలా బయటపడాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 01, 2025 | 2:58 PM

Share
అవిసె గింజలు, చియా విత్తనాలు.. ఈ రెండు విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ రెండు రకాల విత్తనాలు పీరియడ్స్‌ క్రమరహిత సమస్యలను కూడా తొలగిస్తాయి. ప్రతి నెలా నిర్ణీత సమయంలో పీరియడ్స్‌ వస్తే.. క్రమేణా సమస్యలు తీవ్రత కూడా తగ్గుతుంది.

1 / 5
మహిళలకు పీరియడ్స్ అనేది ప్రతి నెల జరిగే సహజ ప్రక్రియ. ఇది వారి శారీక, భావోద్వేగ సవాళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. శారీరకంగా పైకి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ఇది మానసిక ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతుంది. కానీ దీని గురించి చాలా మంది ఎక్కువగా పట్టించుకోరు. బుతుక్రమం సమయంలో ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత మందిలో హార్మోన్ల సమతుల్యం వలన ఇది వారి మానసిక ప్రశాంతతపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

2 / 5
చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఋతుస్రావాన్ని నెలవారీ అసౌకర్యంమైన చర్యగా తెలిపారు. ఎందుకంటే దీని వలన కలిగే నొప్పి, ఆందోళన వంటి సమస్యలు  ఇవన్నీ స్త్రీలకు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం.కానీ ఇది మహిళల సమస్య కాదు, ఋతుస్రావం అనేది జీవసంబంధమైన విధి లాంటిది. పట్టణ, పల్లె ఇలా ఎంతోమంది జనాభా తమ జీవితంలో ఈ సమస్యను అనుభవిస్తున్నారు.అందువల మొదటగా దీనిని ఏదో పెద్ద సమస్యగా చూడకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ప్రతి నెల వచ్చే సామాన్య ప్రక్రియలానే దీనిని భావించాలంట. దీని వలన ఒత్తిడి కాస్త తగ్గుతుందంట.

3 / 5
పీరియడ్స్ అనేది చాలా మంది మహిళల్లో అసౌకర్యానికి కారణం అవుతుంది. శారీరకంగా ఇది వారిని ఇబ్బంది పెడుతుంది. తిమ్మరి, ఉబ్బరం, అలసట వంటి సమస్యలు వీరిని చుట్టుముడుతుంటాయి. ఇవే కాకుండా చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నట్లు ఓ నివేధికలో వెల్లడైంది. ముఖ్యంగా వృత్తిపరమైన ప్రదేశాలలో ఇవి వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సమయంలో చాలా మంది మహిళలు మౌనంగా ఏదో కోల్పోయిన్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయంట. దీనిని నుంచి బయటపడాలంటే, మీరు మీ సన్నిహితురాలితో ఆనందంగా సంభాషించడం వంటివి చేయడం ఉత్తమం.

4 / 5
ఇక పీరియడ్స్ సమయంలో చాలా మంది ఎదుర్కొనేది భయం. లీకేజీ భయం, ఋతుస్రావం సమయంలో ఉన్నవారి భద్రత  ప్రశాంతతను దెబ్బతీస్తుంది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, 76% మంది ప్రతివాదులు ఇప్పటికీ లీక్‌లను అనుభవిస్తున్నారు. 38% మందికి, ఈ భయం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా ఇది వారి మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

5 / 5