- Telugu News Photo Gallery Technology photos Youtube developing new AI Feature called Jump ahead, Check here for full details
Youtube: సుత్తి లేకుండా నేరుగా.. యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్..
ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ చిన్న అంశానికి సంబంధించిన వీడియోను ఇందులో వీక్షించవచ్చు. ప్రతీ రోజూ యూట్యూబ్‌లో కోట్లాది వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. అంతేనా యూట్యూబ్‌తో డబ్బులు ఆర్జిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే యూట్యూబ్ తాజాగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది..
Updated on: Apr 05, 2024 | 3:08 PM

యూజర్లను ఆకట్టుకునే క్రమంలో యూట్యూబ్ నిత్యం కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తూనే ఉంటుంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను తెస్తున్న యూట్యూబ్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

యూట్యూబ్‌లో మనం చూసే వీడియోలో కీలక విషయం ఎక్కడో ఉంటుంది. అయితే వీడియో మాత్రం చాలా లెంగ్తీగా ఉంటుంది. మరి వీడియోలో కీలకమైన సమాచారం ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి. ఇందుకోసమే యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

‘జంప్ ఎహెడ్’ అనే పేరుతో ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలోని కీలకమైన, అతి ముఖ్యమైన కంటెంట్ భాగాలను తమ యూజర్లు వీక్షించే వెసులుబాటు కలిగించనుంది

దీంతో పూర్తి వీడియో చూడాల్సిన అవసరం లేకుండానే ముఖ్యమైన సమాచారాన్నీ వీక్షించవచ్చు. నేరుగా కంటెంట్ లో ఉన్న హైలైట్‌ల మాత్రమే చూపించేలా ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నారు.

తక్కువ సమయంలోనే వీడియోలోని కీలక అంశాలను తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.





























