itel s24: ‘కలర్‌ చేంజింగ్ టెక్నాలజీ’తో కొత్త ఫోన్‌.. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..

ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ ఐటెల్‌ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్‌ ఎస్‌24 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఈఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Mar 30, 2024 | 8:55 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఐటెల్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐటెల్‌ ఎస్‌24 పేరుతో ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
 ఐటెల్‌ ఎస్‌24 ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ91 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 'కలర్‌ చేంజింగ్‌ ఫోటోక్రోమింగ్ టెక్నాలజీ'ని ఇచ్చారు. దీంతో నేచురల్ లైట్ మీద పడినప్పుడు ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుంది.

2 / 5
ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు.

3 / 5
90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 480 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు, సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. 40 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు.

5 / 5
Follow us