
వాట్సాప్‌లో నిత్యం మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌ల కారణంగా నిత్యం ఏదో ఒక గ్రూప్‌లో మెసేజ్‌లు వస్తుంటాయి. దీంతో వాట్సాప్ చాట్స్ అన్ని మెసేజ్‌లతో నిండి పోతుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇది యూజర్లకు ఇబ్బందిగా మారుతుంది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసే పనిలో పడింది. కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్‌లు, ఫొటోల కారణంగా ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ 'క్లియర్ అండ్ రీడ్ మెసేజ్ కౌంట్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు చదవని మెసేజ్‌లను ఓపెన్ చేయగానే ఆటోమేటిక్‌గా వాటంతటవే క్లియర్ అవుతాయి.

దీంతో వాట్సాప్‌లో చాట్స్‌లో ఇకపై 'అన్ రీడ్' మెసేజ్‌లను కౌంట్ చాట్‌లో చూపించదు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.11.13 బీటా వర్షెన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ఇటీవల వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేజ్‌ను కూడా పూర్తి స్థాయిలో మార్చిన విషయం తెలిసిందే. గ్రీన్ కలర్ లోగోతో పాటు, బ్యాగ్రౌండ్ కలర్‌ను వైట్ కలర్‌లోకి మార్చిన విషయంత తెలిసిందే.