Vivo Pad Air: వివో నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్లు
మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్‌తో సమానంగా ట్యాబ్‌లు హల్చల్ చేస్తున్నాయి. రోజుకో కొత్త కంపెనీ ట్యాబ్స్‌ను తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు ట్యాబ్ కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే ట్యాబ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొస్తోంది. వివో ప్యాడ్ ఎయిర్ పేరుతో త్వరలోనే ఈ కొత్త ట్యాబ్ మార్కెట్లో సందడి చేయనుంది. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..