- Telugu News Photo Gallery Technology photos Redmi launching new earbuds Redmi Buds 6 features and price details
Redmi Buds 6: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఇయర్ బడ్స్.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫీచర్లను ఇందులో అందించనున్నారు. రెడ్‌మీ బడ్స్ 6 పేరుతో తీసుకొస్తున్న ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 05, 2024 | 10:34 PM

రెడ్‌మీ బడ్స్ 6 ఇయర్ బడ్స్‌లో డ్యూయల్ డ్రైవర్‌లను అందించనున్నారు. అలాగే ఇందులో 12.4 mm డైనమిక్ డ్రైవర్, 5.5 mm మైక్రో-పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ యూనిట్‌ను ఇచ్చారు. స్పేషియల్ ఆడియో టెక్నాలజీని ప్రత్యేకంగా అందించారు. ఇది రియలిజంతో కూడిన మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఇక ఈ ఇయర్‌బడ్‌లు 49dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. దీంతో క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్‌ను పొందొచ్చు. ఇందులో AI యాంటీ-విండ్ నాయిస్ టెక్నాలజీతో పెద్ద గాలి వీచే సమయంలో కూడా స్పష్టమైన ఫోన్ కాల్స్ అనుభూతి పొందొచ్చు.

వీటిని ఐపీ54 రేటింగ్‌తో అందించారు. దీంత డస్ట్‌తో పాటు, వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ పొందొచ్చు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 42 గంటల బ్యాకప్ అందిస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో గరిష్టంగా 4 గంటల ప్లేబ్యాక్ పొందొచ్చు.

ఇక ఈ ఇయర్ బడ్స్ కనెక్టివిటీ విషయానికొస్తే బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ కెమెరాను కంట్రోల్ చేయడానికి ఈ ఇయర్ బడ్స్‌లో స్మార్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్‌తో పాటు రిమోట్ షట్టర్ ఫంక్షన్‌ను అందించారు.

ధర విషయానికొస్తే ఇప్పటి వరకు కంపెనీ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 3 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్.కామ్‌తో పాటు అమెజాన్‌లో ఈ ఇయర్ బడ్స్ అందుబాటులోకి రానున్నాయి.




