- Telugu News Photo Gallery Technology photos Find what song playing around you with this simple future
Tech: ఈ పాట ఏ సినిమాలోనిదబ్బా.. మీక్కూడా ఇలాంటి సందేహం వచ్చిందా.?
కారులోనో, బస్సులోనే వెళ్తున్నప్పుడు ఎఫ్‌ఎమ్ లేదా ప్లేయర్‌లో ఒక మంచి పాట వస్తుంది. ఆ పాట అంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. కానీ మీకు ఆ పాట తెగ నచ్చుతుంది. దీంతో ఆ పాట ఏ సినిమాలోనిదన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంటుంది. అయితే తెలుగు పాట అయితే ఏదో రకంగా సెర్చ్ చేస్తారు.? ఇతర భాషల సాంగ్స్ అయితే కష్టం కదూ...
Updated on: Dec 05, 2024 | 10:11 PM

ఎక్కడో ఒక చోట వినిపించే పాట మనకు ఎంతగానో నచ్చుతుంది. అయితే ఆ పాట ఏ సినిమాలోనిదన్న విషయం మాత్రం గుర్తుకురాదు. ఇలాంటి సమయాల్లో ఏం చేస్తాం. పక్కనున్న వారిని అడుగుతాం. వారికి కూడా తెలియదలంటే వదిలేస్తాం.

కానీ ఆ పాటను మళ్లీ వినాలంటే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఆండ్రాయిడ్ ఓ అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో సదరు పాటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు.

ఐఓఎస్‌లోని ‘షాజమ్’ మాదిరిగా ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తాజా 15 అప్‌డేట్స్‌తో ‘సర్కిల్స్ టు సెర్చ్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు కేవలం పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను మిగతా ఫోన్‌లలోనూ తీసుకొచ్చారు.

ఇందుకోసం ముందుగా యూజర్లు హోమ్ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకోవాలి. వెంటనే కింది భాగంలో కుడి వైపు మెనూ బార్ ప్రత్యక్షమవుతుంది. అందులో ‘ఐడెంటిఫై సాంగ్’ అనే ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి.

ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తర్వాత బయట వినిపించే పాట శబ్ధం, భాష ఆధారంగా దానికి సంబంధించిన లింక్ ప్రత్యక్షమవుతుంది. దీంతో యూట్యూబ్‌లోకి వెళ్లి ఆ పాటను వినొచ్చు. అంతేకాదు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన మీరు పాట పాడినా వెంటనే గుర్తుపడుతుంది.




