- Telugu News Photo Gallery Technology photos Poco C51 new version is priced at Rs 8,999 and will be sold via Flipkart check here for full details Telugu Tech News
Poco C51: పోకో నుంచి బడ్జెట్ ఫోన్.. రూ. 6500కే అదిరిపోయే ఫీచర్లు..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో సీ 51 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి తాజాగా అందుబాటులోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం వెతుకుతోన్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 05, 2023 | 9:14 AM

పోకో సీ51 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,499కాగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్‌గా పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇందులో 6.52 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే పోకో సీ51లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీలకోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింటర్ సెన్సర్‌ను అందించార. అలాగే కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో ఐక్రో యూఎస్‌బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ అందించారు.





























