- Telugu News Photo Gallery Technology photos Japanese watch company launches finger watches check here for details Telugu Tech News
Finger Watch: భలారే విచిత్రం.. చేతి గడియారాలని కాదు.. ఇకపై వేలి గడియారాలని పిలవాలి.
ట్రెండ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. రోజుకో కొత్త రకం గ్యాడ్జెట్ మార్కెట్‌లో సందడి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం అవుట్ డేటెడ్ అనుకున్నదే ఇప్పుడు మళ్లీ కొత్తగా మారి మన ముందుకు వస్తుంది. ఒకప్పుడు వాచ్‌లు అంటే ఉందా తనంగా చిహ్నంగా ఉండేవి. ఆ తర్వాత స్మార్ట్ వాచ్‌లు వాటిని రేప్లేస్ చేశాయి. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త రకం వాచ్‌లు వచ్చేస్తున్నాయి. అవేంటంటే..
Updated on: Sep 05, 2023 | 10:31 AM

ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి ప్రాధాన్యత క్రమేణ తగ్గుతూ వచ్చింది.

అయితే ఎప్పుడైతే స్మార్ట్ వాచ్‌లు మార్కెట్లో సందడి చేయడం ప్రారంభించాయో చాలా మంది వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా వాచ్‌ల తయారీలో మరో కొత్త అధ్యయనం మొదలైంది. చేతి గడియారం అనే పేరునే మార్చేలా కొత్త వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని చూస్తే వేలి గడియారాలు అని పిలవాలి.

అవును ఈ వాచ్‌లను వేళ్లకు ధరించుకోవాల్సి ఉంటుంది. జపాన్‌కు చెందిన క్యాసియో అనే సంస్థ ఇటీవల స్టాన్టో స్టాండ్ స్టోన్స్ అనే సంస్థతో కలిసి వేలికి ఉంగరాల్లో ధరించే వాచీలను తయారు చేసింది.

అచ్చంగా వాచ్‌ను పోలి ఉండే వీటిని వేళ్లకు ధరించుకోవచ్చు. రకరకాల మోడల్స్‌లో ఈ వాచ్‌లను తయారు చేశారు. ఈ వాచ్‌లో క్యాలికులేటర్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్‌ను సైతం అందించడం విశేషం.





























