- Telugu News Photo Gallery Technology photos Phone Tricks: Make your old smartphone like a new phone adopt these tips and tricks mobile will run super fast
Phone Tricks: ఇలా చేస్తే మీ పాతఫోన్ కొత్త ఫోన్‌లా సూపర్ ఫాస్ట్ అవుతుంది!
Phone Tricks: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మొబైల్‌లో యాప్స్, ఫోటోలు, వీడియోలు ఎక్కువ కావడం వల్ల స్టోరేజీ నిండి మొబైల్ స్లో అవుతుంది. దీని వల్ల చీటికిమాటికి నెమ్మదిస్తుంది. కొన్ని ట్రిక్స్ పాటిస్తే పాత ఫోన్ కూడా కొత్తదానిలా మార్చవచ్చు..
Updated on: Nov 07, 2024 | 6:36 PM

Phone Tricks : చాలా మంది కొత్త ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఫోన్ లాగా మార్చుకునే మార్గాలు ఉన్నాయి. మీ పాత ఫోన్ కొత్త ఫోన్ వలె వేగంగా పని చేస్తుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ స్లోగా పని చేస్తున్నప్పుడు లేదా సరిగ్గా పని చేయనప్పుడు ఈ ట్రిక్స్ ద్వారా మీ పాత ఫోన్‌ని కొత్తంత వేగంగా రన్ చేసేలా చేయవచ్చు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యాక్సెస్‌ను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ బాధ్యత తల్లిదండ్రులపైనా, యువతపైనా కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఆ దేశంలో 16 యేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుంది.

మీ ఫోన్ నుండి పనికిరాని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి: స్మార్ట్‌ఫోన్‌లలో చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే మనం రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటాం. అలాంటప్పుడు, మీరు ఉపయోగించని యాప్‌లను ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

సాఫ్ట్‌వేర్‌ను తనిఖీ చేయండి : Apple iOS, Google Android సాఫ్ట్‌వేర్ కోసం తాజా అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయండి. ఈ అప్‌డేట్‌లు పాత ఫోన్‌కి మళ్లీ కొత్త అనుభూతిని ఇవ్వగలవు. అలాగే ఫోన్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఫోన్ వేగంగా పని చేసేలా చేసే అనేక బగ్‌లను పరిష్కరించవచ్చు. సిస్టమ్, భద్రతా అప్‌డేట్‌లు మారుతూ ఉంటాయి. యాప్స్‌ను అప్‌డేట్ చేయండి.

రోజూ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి : ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల ర్యామ్ ఫ్రీ అవుతుంది. యాప్‌లను రీసెట్ చేస్తుంది. RAM తక్కువగా ఉన్న ఫోన్‌లకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ ఫోన్ ఛార్జింగ్: మీ ఫోన్ కేబుల్ దెబ్బతిన్నట్లయితే ఒరిజినల్ కేబుల్‌ను కొనుగోలు చేయండి. బ్యాటరీని తరచుగా 100%కి ఛార్జ్ చేయవద్దు లేదా మీ ఫోన్ 15% కంటే తక్కువగా ఉంటే దాన్ని ఉపయోగించవద్దు. ఛార్జింగ్ చేసేటప్పుడు కేవలం 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాక్టరీ రీసెట్: అన్ని ట్రిక్స్ ప్రయత్నించిన తర్వాత కూడా ఫోన్‌లో తేడా కనిపించకపోతే, చివరి ప్రయత్నం ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇది మీ ఫోన్‌ని కొత్తగా కనిపించేలా చేస్తుంది. మీ మొత్తం డేటా కూడా తొలగిపోయి కొత్త ఫోన్‌లా కనిపిస్తుంది. అన్ని ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లను బ్యాకప్ చేయండి.





























