- Telugu News Photo Gallery Technology photos NCR Corporation introduced cardless money withdrawal from atm with upi apps
ATM: ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకోవాలంటే కార్డ్ ఉండాల్సిన పనిలేదు.. యూపీఐ యాప్ ఉంటే చాలు..
ATM: యూపీఐ పేమెంట్స్ ద్వారా మనం డబ్బులను ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌లోకి పంపగలమని మాత్రమే తెలుసు. అయితే తాజాగా ఎన్‌సీఆర్ కార్పొరేషన్ అనే సంస్థ యూపీఐ యాప్ ద్వారా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులు బాటును కల్పించింది..
Updated on: Nov 23, 2021 | 8:17 AM

సాధారణంగా ఏటీఎమ్‌లలో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కచ్చితంగా ఏటీఎమ్ కార్డు ఉండాల్సిందే. అయితే పొరపాటున ఏటీఎమ్ కార్డ్ మర్చిపోతే పరిస్థితి ఏంటి.? డబ్బు డ్రా చేసుకోవడం ఇబ్బంది మారుతుంది కదూ!

ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు యాప్‌లలో కార్డ్ లెస్ విత్‌డ్రా పేరుతో ఓ ఆప్షన్‌ను అందించాయి. అయితే సదరు బ్యాంకు ఏటీఎమ్‌లో మాత్రమే యూజర్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ ఏటీఎమ్‌లో అయినా కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది.

దీనిని దృష్టిలో పెట్టుకునే ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ సహాయంతో ఏదైనా యూపీఐ యాప్‌తో ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇందుకోసం ముందుగా ఏటీఎమ్‌లో క్యూఆర్ కోడ్‌ను ఓపన్ చేయాలి. అనంతరం మీ యాప్‌తో స్కాన్ చేసిన అవసరమైన అమౌంట్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.

1500పైగా ఏటీఎంలలో ప్రస్తుతం ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన ఎన్‌సీఆర్ మరిన్ని వాటిలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విధానం ద్వారా రూ. 5000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.




