- Telugu News Photo Gallery Technology photos Motorola reveal the concept of Bendable Phone that Can Wrap Around Wrists
Bending phone: టెక్ రంగంలో మరో అద్భుతం.. చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్..
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణల కారణంగా మార్కెట్లోకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ తయారీలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా రోలబుల్ అంటే ఫోల్డ్ చేసే ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉండనుంది.? ఫీచర్స్ ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు మీకోసం..
Updated on: Oct 26, 2023 | 12:12 PM

మోటరోలా సంస్థ చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ దిశగా మోటో ఇప్పటికే ఓ అడుగు ముందుకేసింది. మెటోరోలా మాతృ సంస్థ అయిన లెనోవో టెక్ వరల్డ్ 2023 ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రదర్శించారు. యూజర్లకు తమకు నచ్చినట్లు ఫోన్‌ను ఫోల్డ్ చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను అచ్చంగా ఒక స్మార్ట్ వాచ్‌లాగే చేతికి ధరించవచ్చు. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 6.9 ఇంచె్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. అయితే ఫోల్డ్ చేసిన సమయంలో స్క్రీన్ సైజ్ 4.6 ఇంచెస్‌గా మారుతుంది.

ఇక ఈ ఫోన్‌ను యూజర్లు తమకు అనుగుణంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ను ఎంతలా ఫోల్డ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్క్రీన్‌ను డెవలప్ చేశారు.

ఇక అచ్చంగా స్మార్ట్ వాచ్‌ను తలపించే ఈ ఫోన్‌లో యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను, ధరించిన డ్రస్ కలర్స్‌కి అనుగుణంగా వాల్ పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతో హ్యాండ్ బ్యాండ్ ఫ్యాషన్ వియర్‌గానూ ఉపయోగపడుతుంది.

మోటరోలా తర్వలో ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌ను లెనోవో ల్యాప్‌టాప్‌ల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్‌కి సంబంధించి కంపెనీ పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది.





























