- Telugu News Photo Gallery Technology photos Jio launches best phone with UPI and live tv streaming Jio Bharat J1 4G features and price
Jio Bharat J1 4G: యూపీఐ, లైవ్ టీవీతో పాటు మరెన్నో ఫీచర్లు.. రూ. 1799కే 4జీ ఫోన్
టెలికం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ఇంటర్‌నెట్ ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన జియో. ఆ తర్వాత తక్కువ ధరలో ఫోన్‌లను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్‌లతో పాటు, ఫీచర్ ఫోన్‌లను తీసుకొచ్చిన జియో.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో భారత్ జీ1 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు..
Updated on: Jul 25, 2024 | 8:45 AM

ప్రముఖ టెలికం రంగ సంస్థ జియో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో భారత్ బీ1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. పేరుకు స్మార్ట్‌ఫోన్ కాకపోయినా స్మార్ట్ ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో యూపీఐ సేవలను పొందొచ్చు. అలాగే జియోపేతో పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. కంటెంట్ స్ట్రీమింగ్ కోసం జియో సినిమాకు కూడా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన అవుట్ డిస్‌ప్లేను ఇందులో అందించారు.

ధర విషయానికొస్తే జియో భారత్ జీ1 4జీ ఫోన్ ధరను రూ. 1799గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను సింగిల్ బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో లభిస్తోంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 2.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2500 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో గల బ్యాటరీని అందించారు. దీంతో మెరుగైన ఛార్జింగ్ లభిస్తుంది. స్టాండ్ బై లో ఈ ఫోన్ రెండు రోజులు ఛార్జింగ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

అయితే ఈ ఫోన్‌లో కేవలం జియో సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇతర సిమ్‌లను ఉపయోగంచడం కుదరదు. బడ్జెట్‌లో ధరలో లైవ్ టీవీ, యూపీఐ పేమెంట్స్ కోసం ఫోన్ చూస్తున్న వారికి జియో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.




