- Telugu News Photo Gallery Technology photos Realme launches Realme Watch S2 smart watch on july 30th, Check here for full details
Realme Watch S2: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్.. లగ్జరీ లుక్స్, స్టన్నింగ్ ఫీచర్స్..
ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలు మార్కెట్లోకి తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రియల్‌మీ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 25, 2024 | 10:26 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీవాచ్ ఎస్2 పేరుతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ లుక్స్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ వాచ్ ఎస్2 వాచ్‌ను జులై 30వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రో సిరీస్‌తో పాటు ఈ వాచ్‌ను తీసుకొస్తున్నారు. ఈ వాచ్‌లో సర్క్యూలర్ డయల్‌తో లాంచ్ చేశారు.

ఇక ఈ వాచ్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 380 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 20 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం ఏఐ పవర్డ్ ఆప్టిమైజేషన్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

రియల్‌మీ వాచ్ ఎస్2లో వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతులో ఉన్నా ఫోన్ పనిచేస్తుంది. 1.3 ఇంచెస్‌తో కూడిన సర్క్యూలర్ డిస్‌ప్లేను ఇచ్చారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌తో వాయిస్ అసిస్టెంట్‌తో చాట్ జీపీటీ ఆప్షన్‌ను అందించారు. వాయిస్ కమాండ్స్‌తో వాచ్ ఫేస్‌లను మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ను బ్లాక్, సిల్వర్ కలర్స్‌తో తీసుకొచ్చారు.




