- Telugu News Photo Gallery Technology photos Honour Launches new earbuds honor choice earbuds x5 price and features details
Honour choice earbuds x5: హానర్ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. స్టన్నింగ్ ఫీచర్స్
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ తాజాగా వరుసగా గ్యాడ్జెట్స్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్‌తో పాటు స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చిన హానర్. తాజాగా ఇయర్ బడ్స్‌ను సైతం లాంచ్ చేసింది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్5 పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 17, 2024 | 9:02 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ మార్కెట్లోకి హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్5 పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేశాయి. ఈ ఇయర్ ధర విషయానికొస్తే రూ. 1999గా నిర్ణయించారు.

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 16వ నుంచి అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన పలు బ్యాంకులకు సంబంధించిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభించనుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 30dB వరకు నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌ను అందించారు. హ్యాండ్స్-ఫ్రీ కాల్ ఆన్సర్ ఫీచర్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. పర్యావరణ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో డ్యూయల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి.

ఇక హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్5 SBC, AAC బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్‌తో 10mm డ్రమ్ డ్రైవర్‌లను అందించార. మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం ANC యాంబియంట్ సౌండ్ ట్రాన్స్‌మిషన్ మోడ్‌ను ప్రత్యేకంగా అందించారు.

ఛార్జింగ్ విషయానికొస్తే చార్జింగ్ కేస్‌తో పాటు 35 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఒక్కచార్జింగ్‌తో తొమ్మిది గంటల నిరంతర ప్లేబ్యాక్, 18 గంటల కాలింగ్‌ను అందిస్తాయి. వీటిని యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా చార్జ్ చేయవచ్చు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను అందించారు.




