రెడ్ మీ 12 5జీ.. దీనిలో 6.79 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. వెనుక వైపు 50ఎంపీ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ కెమెరా వస్తుంది. 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.10,999, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.12,499, 8జీబీ+256జీబీ మోడల్ ధర రూ.14,499గా ఉంది.