- Telugu News Photo Gallery Technology photos Have you seen brushes on the sides of escalators they are not for cleaning shoes know its purpose
Escalators Brushes: ఎస్కలేటర్‌కు ఇరువైపులా బ్రష్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే
Escalators Brushes: షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లలో మీరు ఎస్కలేటర్లు ఉండటం మీరు చూసే ఉంటారు. ఈ ఎస్కలేటర్ ఇరువైపులా బ్రష్‌లు కూడా ఉంటాయి. ఈ బ్రష్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఈ బ్రష్‌లు నైలాన్‌తో తయారు చేసి ఉంటాయి. దాదాపు ప్రతి ఎస్కలేటర్‌లో కనిపిస్తాయి..
Updated on: Mar 04, 2025 | 1:10 PM

Escalators: షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లలో మీరు ఎస్కలేటర్లు చూసే ఉంటారు. ఇవి మెట్లు ఎక్కుకుండా సులభంగా వెళ్లేందుకు ఉపయోగపడతాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఎస్కలేటర్లలో ఓ విషయాన్ని మీరు గమనించారా? ఈ ఎస్కటేర్లకు రెండు వైపులా బ్రష్‌లు ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా గమనించారా? చాలా మంది ఈ బ్రష్‌లు షూలు శ్రభంగా ఉండేందుకు అని అనుకుంటారు. కానీ అది తప్పు. అందుకు వేరే కారణం ఉంది.

వీటిని 'సేఫ్టీ బ్రష్‌లు' అంటారు. మెట్లు, రెయిలింగ్ మధ్య బట్టలు, బూట్లు లేదా లేసులు ఇరుక్కుపోకుండా నిరోధించడం వారి పని. ఈ బ్రష్ నిజానికి ఒక రకమైన మానసిక రక్షణ అని నిపుణులు అంటున్నారు. బ్రష్ ఎవరి పాదాలను లేదా బట్టలను తాకినప్పుడు, అది స్వయంచాలకంగా అంచు నుండి దూరంగా కదులుతుంది. అందుకే వీటిని అంచులలో అమర్చుతారు. అక్కడ బట్టలు లేదా బూట్లు ఇరుక్కుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ఎస్కలేటర్ పసుపు అంచుకు సమీపంలో బ్రష్‌లు ఉంటాయి. ఈ పసుపు రంగు అంటే ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, మీ పాదాలను ఈ గుర్తుకు దూరంగా ఉంచండి. రెండు వైపులా ఉన్న బ్రష్ మన బట్టలు, ఇతర సన్నని వస్తువులు ఎస్కలేటర్‌లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది. అందుకే వీటిని ఏర్పాటు చేస్తారు.

ఎస్కలేటర్‌లోని బ్రష్‌లు భద్రతా ఫీచర్‌గా పనిచేస్తాయి. ఈ బ్రష్ ఒక హెచ్చరిక లాంటిది అనే చెప్పొచ్చు. మీ పాదం పసుపు గుర్తును దాటి దాని సమీపంలోకి చేరుకున్న వెంటనే ఈ బ్రష్ పాదాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతుంది. అలాగే ఎస్కలేటర్ ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది ఈ బ్రష్‌తో షూలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం సరైంది కాదు.

ఎస్కలేటర్లలో బట్టలు ఇరుక్కుపోవడం వల్ల ప్రజలు గాయపడిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి. అందువల్ల మీరు ఎస్కలేటర్‌ను ఉపయోగించినప్పుడు బూట్లు, ఇతర వాటిని పసుపు గుర్తుకు దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి.




