- Telugu News Photo Gallery Technology photos Flipkart offering huge discounts on apple products check here for full details
Apple: యాపిల్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో, ఆఫర్ కొన్ని రోజులో..
టెక్ రంగంలో యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌కు చెందిన గ్యాడ్జెట్‌ను కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఆశపడుతుంటారు. అయితే ఎంత ఆసక్తి ఉన్నా యాపిల్ ప్రొడక్ట్స్ ధర చూసి వెనుకడుగు వేస్తుంటారు. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా యాపిల్ ప్రొడక్ట్స్‌పై మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇంతకీ ఈ సేల్‌లో ఏ ప్రొడక్ట్స్‌పై ఎంత డిస్కౌంట్ లభించనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 11, 2024 | 10:11 PM

Apple MacBook Air M1: యాపిల్ మ్యాక్‌బుక్ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఇప్పుడు మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1ను రూ. 67,990కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3500 డిస్కౌంట్ లభిస్తుంది.

Apple 2nd gen AirPod: ఈ ఎయిర్‌పాడ్‌ల ధర రూ. 12,900కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 4,401 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 8,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు కూడా కలుపుకుంటే రూ. 1500 అదననంగా డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకుంటే వీటిని రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు.

ఆపిల్ వాచ్ సిరీస్ 9: యాపిల్ వాచ్ సిరీస్ 9పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏకంగా రూ. 8,901 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈఎమ్‌ఐపై రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ. 30,999కి సొంతం చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 15: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా యాపిల్ 15పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా రూ. 13,401 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 64,999కే సొంతం చేసుకోవచ్చు.

Apple iPad 9th gen: యాపిల్ ఐపాడ్ 9th జెన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,901 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఐప్యాడ్‌ను రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.23,499కే సొంతం చేసుకోవచ్చు.




