- Telugu News Photo Gallery Technology photos Flipkart offering huge discount on smart phones check here for full details
Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్.. ఏయే బ్రాండ్స్‌పై అంటే..
ఈకామర్స్ సంస్థలు ఆఫర్స్ ప్రకటించడం సర్వసాధారణమైన విషయం. అయితే ఒకప్పుడు కేవలం పండుగలకు మాత్రమే ఆఫర్లను ప్రకటించే వారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎలాంటి సందర్భం లేకుండానే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ డీల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే పలు మొబైల్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నారు..
Updated on: Apr 22, 2024 | 12:13 PM

ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ డీల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని ఫోన్‌లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఏయే మొబైల్స్‌పై ఎలాంటి ఆఫర్లు లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్15 స్మార్ట్ ఫోన్‌పై రూ. 5000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

రియల్‌మీ పీ1 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో రూ. 20వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ నథింగ్ ఫోన్ 2ఏ అసలు ధర రూ. 25,999కాగా ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా రూ. 21,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే అదనం రూ. 2000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్షన్ 7200 ప్రో చిప్‌సెట్ వంటి పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 21 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 27,999కాగా 21 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై రూ. 2000 తగ్గింపు ఉంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.





























