- Telugu News Photo Gallery Technology photos How to stop inappropriate content youtube on your kids smartphone
YouTube: మీ చిన్నారులు యూట్యూబ్ చూస్తున్నారా.? అలాంటి వీడియోలు రాకూడదంటే..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. స్కూలుకు కూడా వెళ్లని చిన్నారులు సైతం స్మార్ట్ ఫోన్‌లకు అడిక్ట్ అవుతున్నారు. గ్రౌండ్‌లో ఆటలు ఆడుకోవాల్సిన వాళ్లు స్మార్ట్ ష్క్రీన్‌కు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు తమకు తెలిసో తెలియకో అసభ్యకరమైన కంటెంట్ చూసే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఒక చిన్న సెట్టింగ్ ద్వారా యూట్యూబ్‌లో అభ్యంతకర వీడియోలకు చెక్ పెట్టొచ్చు..
Updated on: Apr 22, 2024 | 1:52 PM

చిన్నారులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వగానే తొలుత చేసే పని యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూడడం. రీల్స్, వీడియోలు ఇలా రకరకాల కంటెంట్‌ను వీక్షిస్తుంటారు. అయితే ఇదే క్రమంలోనే వారి ప్రమోయం లేకుండానే కొన్ని రకాల అభ్యంతకర వీడియోలు కూడా వస్తుంటాయి.

మరి చిన్నారులకు ఇలాంటి కంటెంట్ కనిపించకుండా చేసే మార్గం లేదా అంటే కచ్చితంగా ఉంది. ఒక చిన్న సెట్టింగ్ ద్వారా అభ్యంతకర వీడియోలు మీ చిన్నారులకు కనిపించకుండా చేయొచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి.? ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీ ప్రొఫెల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని. జనరల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

తర్వాత కిందికి స్క్రోల్ చేయాలి. ఇలా చేస్తే మీకు రిస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి సెలక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా యూట్యూబ్‌లో వచ్చే ఫీడ్‌లో అభ్యంతకర వీడియోలు కనిపించడం ఆగిపోతాయి. దీంతో మీ పిల్లలు యూట్యూబ్‌ను ఆపరేట్ చేసే సమయంలో ఎలాంటి అభ్యంతకర వీడియోలు చూపించవు.

వీటితో పాటు కొన్ని రకాల పేరెంటింగ్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ చిన్నారులు ఫోన్‌లో ఏం చేస్తున్నారు.? ఎలాంటి కంటెంట్‌ను కంట్రోల్ చేయొచ్చనే విషయాలను మీరే కంట్రోల్ చేసుకోవచ్చు.





























