smart phones: రూ. 6 వేల లోపు స్మార్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? ఈ బెస్ట్ ఫోన్స్ మీ కోసమే..
smart phones under 6000: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? మీ బడ్జెట్ రూ. 6 వేల లోప అయితే మీరు కోరుకునే బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి...
Jio Phone Next: రూ. 6 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో జియో ఫోన్ నెక్ట్స్ ఒకటి. రూ. 4,398గా ఉన్న ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎమ్215 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
1 / 5
Lava Z21: రూ. 5,099కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.0 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో రూపొందించిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వీ11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 3100 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 5 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
2 / 5
Samsung Galaxy A03: రూ. 6 వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ03 ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 5999గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు 48 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. 6.5 ఇంచెస్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
3 / 5
Nokia 2.1: స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్ ధర రూ. 5,999గా ఉంది. 4000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ ఫోన్‌లో 5.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమర, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం.
4 / 5
Itel A25 Pro: ఐటెల్ కంపెనీకి చెందిన ఏ25 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ. 4,625గా ఉంది. ఇందులో 5 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. 3020 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.