
కావల్సిన పదార్థాలు: వేపుడుకి కావల్సిన చేప ముక్కలు: 6 కోడి గుడ్డు : ఒకటి, గరం మసాలా పొడి: అర టీ స్పూన్, జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్: కార్న్ ప్లోర్ : టీ స్పూన్ కారం : టీ స్పున్ పసుపు: పావు టీ స్పూన్, నిమ్మరసం : 2 టీ స్పూన్స్, ఉప్పు : రుచికి సరిపడా తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు నూనె: వేయించడానికి సరిపడా

చేప ముక్కలను శుభ్రంగా కడిగి నిమ్మరసం, ఉప్పు,పసుపు వేసి కొంచెం సేపు పక్కకు పెట్టాలి.

తర్వాత కార్న్ ప్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర,గరం మసాలా, కొత్తిమీర, కర్వేపాకు వేసి చేపల ముక్కలకు పట్టే విధంగా కొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

అరగంట తర్వాత తీసుకుని బయట పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టౌ వెలిగించి లోతులేని అడుగు మందంగా ఉండే కళాయిని పెట్టుకుని నూనె వేసుకోవాలి.

నూనె వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేసి చిన్న మంటమీద రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకూ వేయించుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ.. గార్నిష్ కోసం క్వాలిసిన వారు జీడిపప్పు వేయించుకుని పెట్టుకోవచ్చు.