Raw Onions: ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా..? శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

Updated on: May 06, 2025 | 11:40 AM

Raw Onions: పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలామంది తినరు. కానీ, రోజుకో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండే ఈ నెలల్లో చల్లగా ఉండి, బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెంటెయిన్ చేయడానికి ఉల్లిపాయ ఎంతగానో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 6
Raw onions

Raw onions

2 / 6
కొంతమందిలో మంచి ఉల్లిపాయలు తింటే అందులో లభించి సల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా సల్ఫర్ ఉంటుంది.. కాబట్టి రక్తపోటును నియంత్రించి గుండెను శక్తివంతంగా తయారు చేస్తుంది.

3 / 6
ఉల్లిపాయల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు, రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.

4 / 6
ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల అందులో లభించే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును సులభంగా కరిగిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు అలాగే చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోండి.

5 / 6
ఫైబర్ రిచ్ ఫుడ్స్ అయిన ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గట్ హెల్త్ సరిగా ఉంటుంది. దీని వల్ల ఎండాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అంతేకాకుండా, వీటిని తినడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మంచిదని చెబుతున్నారు నిపుణులు, వేడి పెరగడం వల్ల వచ్చే మొటిమలు, మచ్చలు సమస్యలు రావు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

6 / 6
ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.