Samosa: మనదేశంలో సమోసా ఏ దేశం నుంచి అడుగు పెట్టింది..? రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ చరిత్ర ఏమిటంటే..
భారతదేశంలో ఫేమస్ స్నాక్ ఐటెం సమోసా.. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా సమోసాలను ఇష్టంగా తింటారు. మారుతున్నా కాలంతో పాటు సమోసాల్లో కూడా అనేక రకాల మార్పులు వచ్చాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ స్నాక్ ఐటెం సమోసా ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా
Updated on: Jun 28, 2023 | 7:03 PM

సమోసా! అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఫుడ్. సమోసా టెస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆహారప్రియులు. భారతదేశంలో సమోసాలను టీ తో పాటు తింటారు. ఒకొక్కసారి స్వీట్-గ్రీన్ చట్నీ తో కలిపి తింటారు. అయితే సమోసాను రకరకాల కూరగాయలతో తయారు చేస్తారు. అయితే సమోసా చరిత్ర ఏమిటి ? భారతదేశంలో సమోసాను ఎప్పుడు తయారు చేయడం ప్రారంభించారు? తెలుసుకుందాం

సమోసా మూలం ఇరాన్ దేశం అని నమ్ముతారు. ఇరాన్ లో మొదటి సంబుష్క అని పిలిచేవారు. ఇదే విషయాన్నీ 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ బెహ్కీ ప్రస్తావించారు. మొదటి సమోసాను మజ్బూర్ ఘజ్నవికి వడ్డించారని చెబుతారు. అప్పట్లో సమోసాలో కివా, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఉండేవి. అయితే, ఈ త్రిభుజాకారంలో తయారు చేయడం ఎప్పుడు ప్రారంభమైందనేవిషయం ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. మన దేశంలో అడుగు పెట్టె సరికి ఈ ఆహార పదార్ధం సమోసా అయింది. దీనిని బీహార్, పశ్చిమ బెంగాల్‌లో సమోసాను మొదట సింఘడ అని పిలిచేవారు.. ఇప్పటికీ కొంతమంది ఈ పేరుతొ పిలుస్తూ ఉంటారు.

ఈ రుచికరమైన వంటకం ఇరాన్ నుండి ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా ప్రయాణించి మన దేశానికి చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రై ఫ్రూట్స్‌కు బదులు మాంసం, ఉల్లిపాయలతోనే సమోసాలు తయారు చేసేవారట. ముఖ్యంగా జంతువులను వేటాడడానికి అడవికి వెళ్లే వారు దీనిని ఉపయోగించారట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకోగానే సమోసా స్టఫింగ్ మారిపోయింది. శాఖాహారాన్ని ఇష్టపడే భారతీయులు సమోసా లోపల ఫీలింగ్ చేసే పదార్థంలో మార్పులు చేశారు.. మాసం బదులు సగ్గుబియ్యం బంగాళాదుంపలతో తయారు చేసిన పదార్ధాన్ని జోడించారు. సీనియర్ జర్నలిస్ట్ పుష్పేష్ పంత్ .. సమోసాను సింక్రెటిక్ డిష్ అంటూ పిలుస్తారు.

భారతదేశంలో క్రమంగా సమోసాలు స్థానిక ఫుడ్ అయిపొయింది. కాలంతో పాటు ఫాస్ట్ ఫుడ్‌గా మారింది. బంగాళదుంపలు, ఇతర కూరగాయలు మాంసం స్థానంలో చేరాయి. నల్ల మిరియాలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం ప్రారంభించారు. సమోసాలలో బంగాళదుంపల కూరను నింపడం పోర్చుగీస్ కాలం నుండి ప్రారంభమైందని చెబుతారు.

భారతదేశంలో సమోసాల అమ్మకం భారీగా జరుగుతుంది. ఇదొక ముఖ్యమైన వ్యాపారంగా మారిపోయింది. భారతదేశంలో అనేక రకాల సమోసాలు ప్రసిద్ధి చెందాయి.. వాటిల్లో ఎక్కువగా బంగాళాదుంపల స్టఫ్ తో నిండిన సమోసాలే. చోలే సమోసాలు, జామ్ సమోసాలు, నూడుల్స్ సమోసాలు, ఫిష్ సమోసాలు, పాస్తా, పంజాబీ , కీమా. చీజ్, మష్రూమ్ , కాలీఫ్లవర్ , చాక్లెట్, ఉల్లిపాయ , స్వీట్, చికెన్, పనీర్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా వంటివి ప్రసిద్ధి చెందాయి.




