Winter Health Tips: శీతాకాలంలో ఇవి తప్పక పాటించండి.. అనారోగ్యం బెండ్ తీసే పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం
ప్రతి సీజన్‌లో కొన్ని వ్యాధులు జనాలను తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అలాగే చలికాలంలో కూడా మనం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చలికాలంలో మనం శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల మన శరీరం వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొలేదు. కాబట్టి చలికాలంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Nov 10, 2025 | 5:59 PM

చలిలో మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి, రోజూ ఉదయం తేలికపాటి వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యోగా లేదా సూర్య నమస్కారంతో మీ రోజును ప్రారంభించాలని.. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడడంతో పాటు అనారోగ్యాన్ని నివారిస్తుందని చెబుతున్నారు.

శీతాకాలంలో ఎక్కువసేపు ఆకలితో ఉండటం హానికరం అని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది, కాబట్టి సమయానికి పోషకమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. "కొద్దిగా ఆహారం తినండి, కానీ ఎక్కువసేపు ఆకలితో ఉండకండి, లేకపోతే బలహీనత, అనారోగ్యం సంభవించవచ్చని చెబుతున్నారు.

శీతాకాలంలో భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 'రాత్రి భోజనం చేసిన తర్వాత, కొద్దిసేపు నడవండి లేదా కొన్ని అడుగులు నడవండి, ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే శరీరం తేలికగా అనిపిస్తుంది' అని నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో దాదాపు అందరూ వేడినీటి స్నానం చేసేందుకు ఇష్టపడతారు. వేడినీటి స్నానం చేయడం వల్ల చలి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అందరూ వేడినీటి స్నానం చేసేందుకు ఇష్టపడతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించి వివరాల ఆధారంగా అందించినవి. కాబట్టి వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.




