- Telugu News Photo Gallery Sports photos Virat Kohli on the Verge of 5 IPL Records: Will He Achieve Them Against CSK
RCB vs CSK: ఈ 5లో ఎన్ని రికార్డులు లేపేస్తాడో..! కింగ్ కోహ్లీని ఊరిస్తున్న భారీ భారీ రికార్డులు
విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 8500 పరుగులు, 9500 టీ20 పరుగులు, 750 ఫోర్లు, ఆర్సీబీ తరఫున 300 సిక్సర్లు సీఎస్కేపై 50 సిక్సర్లు అనే ఐదు రికార్డులను సాధించేందుకు అవకాశం ఉంది. ఈ రికార్డులు సాధించడానికి అతను చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
SN Pasha |
Updated on: May 03, 2025 | 5:31 PM

పాయింట్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌తో పాటు ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించడమే లక్ష్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగబోతుంది. శనివారం హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీని ఓ ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులు ఏంటి? వాటిని ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ అందుకుంటాడో లేదో చూడాలి.

ఐపీఎల్‌లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ పేరిట అద్బుతమైన రికార్డ్ ఉంది. అయితే.. ఈ రికార్డులోనే మరో మైలురాయిని కోహ్లీ అందుకునేందుకు దగ్గర్లో ఉన్నాడు. ఐపీఎల్ 8500 పరుగులకు విరాట్ కోహ్లీ 53 పరుగుల దూరంలో ఉన్నాడు. సీఎస్‌కే మ్యాచ్‌లో 53 రన్స్ చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 8500 రన్స్ ఏకైక ప్లేయర్‌గా నిలుస్తాడు.

అలాగే ఇండియాలో టీ20 క్రికెట్ ఆడుతూ.. 9500 పరుగులు మైలురాయిని అందుకోవడానికి విరాట్ కేవలం 10 పరుగులు దూరంలో ఉన్నాడు. టీ20ల్లో 9500(ఇండియాలో ఆడిన మ్యాచ్‌లు, ఐపీఎల్ అంతర్జాతీయ మ్యాచ్‌లు కలుపుకొని) కచ్చితంగా ఈ మ్యాచ్‌తోనే సాధిస్తాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నా

ఇక ఐపీఎల్ మరో క్రేజీ రికార్డుకు కోహ్లీ అతి చేరువగా వచ్చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే.. ఫోర్లే. ఐపీఎల్ కోహ్లీ ఇప్పటి వరకు 744 ఫోర్లు బాదేశాడు. 750 మైల్ స్టోన్ చేరుకోవడానికి కేవలం 6 ఫోర్లు దూరంలోనే ఉన్నాడ. ఫోర్లు ఎక్కువగా కొట్టే కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డ్ అందుకోవాలని అంతా ఆశిస్తున్నారు.

ఫోర్లే కాదు.. సిక్సర్ల విషయంలో కూడా విరాట్ కోహ్లీ ఒక సూపర్ రికార్డ్‌ను అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఒక్క సిక్స్ కొడితే చాలు.. ఆర్సీబీ తరఫున 300 సిక్సర్లు కొట్టినే ప్లేయర్‌గా కోహ్లీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున కోహ్లీ 299 సిక్సులు(ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ టీ20 కలుపుకొని) బాదేశాడు.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డ్ ఉంది. ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 50 సిక్సర్లకు విరాట్ కోహ్లీ 7 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో ఇదే చివరి మ్యాచ్ కావడంతో.. ఆ 7 సిక్సులు కొట్టేస్తే.. సీఎస్‌కే సిక్సర్ల హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని.. అరుదైన రికార్డ్ సాధిస్తాడ. మరి ఈ రికార్డుల్లో ఎన్ని అందుకుంటాడో చూడాలి.



















