గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. మార్చి 23 న పూణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో అయ్యర్‌కు గాయమైంది. ఎడమ భుజానికి గాయం కావడంతో అయ్యర్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఈ గాయం కారణంగా, అయ్యర్ సుమారు 5-6 వారాల పాటు మైదానానికి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.