- Telugu News Photo Gallery Sports photos IPL 2024 why dhoni wouldn't be an ideal impact player Know Here Details
IPL 2024: ఇంప్లాక్ట్ ప్లేయర్‌గా ధోని మళ్లీ కొనసాగుతాడా? ఇంట్రస్టింగ్ విశ్లేషణలు..!
IPL 2024: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉన్నందున ధోనీ మరో రెండేళ్లు ఆడే అవకాశం ఉందని పలువురు విశ్లేషించారు.
Updated on: Jun 04, 2023 | 6:30 AM

IPL 2024: ఐపీఎల్ సీజన్ 16 ఇలా ముగిసిందో లేదో వెంటనే.. మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ గురించిన ప్రశ్నకు మరోసారి సమాధానమిచ్చాడు. వేచి చూస్తానంటూ ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టేశాడు. సీఎస్‌కే జట్టు ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ధోనీ మాట్లాడుతూ.. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. తర్వాత చూద్దాం అని బదులిచ్చారు.

ఈ కామెంట్‌నిబట్టి, మిస్టర్ కూల్.. వచ్చే సీజన్‌లోనూ సీఎస్‌కే జట్టు తరుఫున పోటీ పడబోతున్నాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. దీనికి మరో కారణం ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండటం.

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండటంతో ధోనీ మరో రెండేళ్లు ఆడే అవకాశం ఉందని పలువురు విశ్లేషించారు. కానీ ధోనీ విషయంలో ఇంపాక్ట్ సబ్ ఆప్షన్ వర్తించదని మరో వాదన ఉంది.

అంటే ధోనీ పూర్తి ఫిట్‌గా ఉంటేనే వచ్చే సీజన్‌లో ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఎంఎస్ ధోనీ అనే బ్యాట్స్‌మెన్ కంటే ధోని అనే కెప్టెన్ చాలా అవసరం.

ఈ లెక్కన చూసుకున్నా.. ఒకవేళ ధోని ఆడితే.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చే ధోనికి ఒకటి రెండు ఓవర్లు మాత్రమే ఆడే అవకాశం లభిస్తుంది.

సీఎస్‌కే జట్టుకు ధోనీ కెప్టెన్సీ అవసరం పెరిగింది. అందువల్ల బ్యాటింగ్ చేసే సమయంలో ధోనీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ని రంగంలోకి దించాల్సి ఉంటుంది.

అయితే ఒకటి, రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసేంత ఫిట్‌నెస్ లేకపోతే ధోనీ వికెట్ కీపర్‌గానూ కనిపించే అవకాశం తక్కువ అని అంచనా వేస్తున్నారు. కెప్టెన్‌గా 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండాల్సి ఉంటుంది. మరి అంత ఫిట్‌నెస్ ధోనికి ఉంటుందా? అనేది ప్రశ్న.

అంటే ఒకటి లేదా రెండు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే ఫిట్‌నెస్ ధోనీకి ఉంటే.. ఖచ్చితంగా సిఎస్‌కె తరపున ఐపీఎల్‌లో రాణిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ద్వారా కూడా ధోని బరిలోకి దిగడం అనుమానంగానే కనిపిస్తోంది.

ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా, CSK జట్టుకు బ్యాట్స్‌మెన్ కంటే ధోని చురుకైన నాయకత్వం అవసరం. అందుకే 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయగల సత్తా ఉంటే మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తాడు.

లేదంటే తాను చెప్పినట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డగౌట్‌లో కొత్త బాధ్యతతో దర్శనమివ్వనున్నాడు.




