- Telugu News Photo Gallery Sports photos India vs England Oval Test: 4 Key Player Changes and Their Impact
IND vs ENG: ఈ ఇద్దరికీ ఇదే చివరి అవకాశం..! ఫెయిల్ అయితే ఒకరు రిటైర్ అవ్వాల్సిందే..?
ఓవల్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టులో నాలుగు ముఖ్యమైన మార్పులు జరిగాయి. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, బుమ్రా స్థానంలో ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్‌కు అవకాశం లభించింది.
Updated on: Jul 31, 2025 | 10:08 PM

ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియాలో నాలుగు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ప్రసీద్ కృష్ణకు, శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్‌కు, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ముఖ్యంగా కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణకు బహుషా ఇదే చివరి అవకాశం అయ్యే ప్రమాదం ఉంది. ఒక వేళ వాళ్లు ఇందులోనూ రాణిచలేకపోతే.

కరుణ్ నాయర్ కు చివరి అవకాశం లభించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో బాగా రాణించకపోవడంతో కరుణ్ 4వ టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ ను జట్టులోకి తీసుకున్నారు. కాబట్టి కరుణ్ తన కెరీర్ ను కాపాడుకోవాలంటే డూ ఆర్ డై మ్యాచ్ అయిన ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో మెరవాలి.

జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ప్రసీద్ కృష్ణకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించారు. ప్రసీద్ కూడా ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. అందువల్ల అతన్ని కూడా జట్టు నుండి తొలగించారు. కానీ ఇప్పుడు ప్రసీద్‌కు చివరి టెస్ట్‌లో చివరి అవకాశం దొరికింది.

గాయం కారణంగా టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. అందువలన ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించింది. ఈ టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు, కానీ గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతనికి జట్టులో స్థానం లభించడంతో ధ్రువ్ జురెల్ బాగా రాణించాల్సి ఉంటుంది.

ఈ సిరీస్ మొత్తంలో ఒక్క అవకాశం కూడా దక్కని అతికొద్ది మంది ఆటగాళ్లలో కుల్దీప్ ఒకడు. ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా వచ్చిన కుల్దీప్ బెంచ్ మీద వేచి ఉండటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అతనితో పాటు అభిమన్యు ఈశ్వరన్, అర్ష్‌దీప్ సింగ్ కూడా అవకాశం దక్కకుండా బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ రాణించకుంటే కరుణ్ నాయర్ ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అనే ప్రచారం జరుగుతోంది.




