హిందూ సంప్రదాయం ప్రకారం, భాద్రపద సుద్ద చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. తర్వాత సరిగ్గా పదిరోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు రోడ్లపై ఘనంగా యువత డీజే డ్యాన్సులు, మేళ తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ ఊరేగింపు నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు.