Weekly Horoscope: వారి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం.. 12 రాశుల వారికి వారఫలాలు

Edited By:

Updated on: Dec 20, 2025 | 5:56 PM

వార ఫలాలు(డిసెంబర్ 21-27, 2025): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశ వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారం గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. అ అనుకూల సమయాన్ని అన్ని విధాలుగానూ సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా లక్ష్యాల వల్ల ఉద్యోగ జీవితం బిజీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొద్దిపాటి మార్పులు చేపడతారు. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.  ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారముంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు బలం వల్ల ఈ వారమంతా ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడిపరంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపు అందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొంటారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవితో పాటు శుక్ర, కుజ, గురువుల అనుకూలత వల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావం వల్ల ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు బాగా సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి ఒకటి రెండు అవకాశాలు రావచ్చు. కొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. సొంత పనుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల చదువులు సజావుగా సాగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. గౌరవమర్యాదలు పెరుగుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో రవితో కలిసి ఉన్నందువ్ల ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. బంధువుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఏ విషయంలోనైనా స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్య మైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పనిభారం, ఒత్తిడి వంటివి తగ్గు ముఖం పడతాయి. హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి.  వ్యాపా రాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అంచనాలకు మించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత పరి చయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో బాగా ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా, ఆశాజనకంగా పురోగమిస్తారు. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం పని చేసి ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసు కోవడం మంచిది. ఆహార విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు పూర్తిగా తీరిపోతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి బాగా అవ కాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో చక్కబడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనితో పాటు బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారం రోజుల పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందు కుంటారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవసరాలను మించి డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ధన స్థానంలో, రవి, కుజులు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధి కారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి జీవితంలో క్షణం తీరిక లేని పరి స్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంటా బయటా బాధ్య తల ఒత్తిడి అధికంగా ఉంటుంది. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. గృహ, వాహన రుణాల ఒత్తిడి నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం శ్రేయస్కరం.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమ‍స్యల నుంచి బయటపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటారు. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో వీలైనంత సహనంతో వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి.