తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుక్ర, రవి, బుధ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. తీవ్రస్థాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు మనసులోని కోరికలు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రు లతో విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం గౌరవప్రదంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది.